న్యూఢిల్లీ : పెద్దగా శారీరీక శ్రమకు లోనవకున్నా తీవ్రమైన అలసట, నిస్సత్తువతో బాధపడుతుంటే శరీర పనితీరుకు కీలకమైన బీ12 విటమిన్ లోపం ఉందేమో చెక్ చేసుకోవడం మేలు. బీ12 ఎర్రరక్త కణాల ఉత్పత్తి, డీఎన్ఏలో చురుకైన పాత్ర పోషిస్తాయి. మెదడు పనితీరు, డెవలప్‌మెంట్‌లోనూ కీలకంగా వ్యవహరిస్తాయి.
శాకాహారుల్లో ప్రధానంగా విటమిన్ బీ12 లోపం కనిపిస్తుంటుంది. విటమిన్ బీ12 లెవెల్స్ శరీరంలో ఎలా ఉన్నాయనేది రక్త పరీక్షలో తెలుస్తుంది. బీ12 లెవెల్స్ పడిపోతే తీవ్రమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, కుంగుబాటు వంటి లక్షణాలు బయటపడతాయి.
వైద్యుల సూచన మేరకు ఇంజెక్షన్లు, సప్లిమెంట్ల ద్వారా విటమిన్ బీ12 లెవెల్స్‌ను సాధారణ స్ధాయికి తీసుకురావచ్చు. ఇక బీ12 లెవెల్స్ పెరిగేందుకు తరచూ చేపలు, షెల్ఫిష్, ఎగ్స్, రెడ్‌మీట్, పాల ఉత్పత్తులు, పెరుగు, బ్రేక్‌ఫాస్ట్ సిరిల్స్, పుట్టగొడుగులు వంటి ఆహారం తీసుకోవాలి.