న్యూఢిల్లీ : మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని వాపోయేవారు కొందరైతే, నిద్ర పట్టేందుకు నిద్ర మాత్రలూ వాడుతుంటారు. అయితే నిద్రలేమికి సింపుల్ టెక్నిక్‌తో చెక్ పెట్టవచ్చని అమెరికా సైనికులు అనుసరించే టెక్నిక్‌తో కేవలం రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకోవచ్చని చెబుతున్నారు. రిలాక్స్ అండ్ విన్ : ఛాంపియన్షిప్ పెర్ఫామెన్స్ అనే బుక్‌లో లాయిడ్ బడ్ వింటర్ ఈ సైనిక టెక్నిక్‌ను రాసుకొచ్చారని జాన్ బ్రౌన్ ట్వీట్ చేశారు.
ఈ టెక్నిక్ ద్వారా అమెరికన్ నేవీ పైలట్లు ఎక్కడైనా ఇట్టే కునుకు తీసేవారని చెబుతున్నారు. ఈ టెక్నిక్‌లో భాగంగా టోటల్ రిలాక్సేషన్ సాధించడమే ప్రధాన ఉద్దేశం. ముందుగా నాలుక, దవడలు సహా ముఖ కండరాలను రిలాక్స్ చేసి, కండ్ల కింద కండరాలకూ విశ్రాంతిని ఇవ్వాలి. ఆపై దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఆపై భుజాలు, చేతుల నుంచి టెన్షన్‌ను బయటకు వదులుతూ రిలాక్స్ అవ్వాలి.
డీప్ బ్రీతింగ్ కొనసాగిస్తూ తొడలు, మోకాళ్ల కిందిభాగాన్ని రిలాక్డ్స్‌గా ఉంచాలి. పూర్తి శరీరాన్ని రిలాక్డ్స్‌గా, తేలికగా చేసిన తర్వాత మనసులో ఎలాంటి ఆలోచనలు లేని స్ధితిలో ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆలోచనలు అదుపులో వచ్చే వరకూ ఈ ప్రక్రియను రిపీట్ చేయాలి. అమెరికన్ సైనికులు పాటించే రెండు నిమిషాల స్లీపింగ్ టెక్నిక్ గతంలో టిక్‌టాక్‌లోనూ వైరల్‌గా మారింది.