న్యూఢిల్లీ : దివాళీ వేడుకలు ప్రారంభమైన వేళ మంచి ఆహారం, మ్యూజిక్, హంగామా లేకుండా ఈ వేడుకలు సంపూర్ణం కావు. పండగ సమయంలో స్వీట్స్, ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు, హై బ్లడ్ షుగర్ సహా ఇతర అనారోగ్యాల బారినపడే ప్రమాదం లేకపోలేదు. వీటి నుంచి తప్పించుకోవాలంటే పండుగ సమయంలో మనం ఆరోగ్యకర ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి.
ఇక పండుగ వంటకాలు, పానీయాల్లో రిఫైన్డ్ షుగర్‌కు బదులు సహజంగా ఉండే తీపిపదార్ధాలను వాడటం మేలు. సహజమైన తీపిగుణం ఉండే పదార్ధాలను వాడటం ద్వారా వంటకాలు మరింత తీపిని అందించడంతో పాటు ఆరోగ్య ప్రయోజానాలనూ చేకూర్చుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించుకోవడంతో పాటు క్యాలరీలకూ చెక్ పెట్టాలంటే రిఫైన్డ్ షుగర్ స్ధానంలో నాచురల్ స్వీటెనర్స్‌ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
రిఫైన్డ్ షుగర్‌తో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు శరీరానికి హాని కలిగిస్తుంది. మార్కెట్లో తేనె నుంచి కొబ్బరి షుగర్ వరకూ ఎన్నో నేచురల్ స్వీటెనర్స్ అందుబాటులో ఉన్నాయి. రిఫైన్డ్ షుగర్‌కు బదులు తేనె, డేట్స్, కోకోనట్ షుగర్, మ్యాపుల్ సిరప్ వంటి నేచురల్ స్వీటెనర్స్‌ను ఆహార పదార్ధాల్లో వాడితే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య,పోషకాహార నిపుణులు చెబుతున్నారు.