Jamun Seeds | నేరేడు పండ్లు మనకు కేవలం వేసవి సీజన్లోనే లభిస్తాయి. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. నేరేడు పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే నేరేడు పండ్లలో ఉండే విత్తనాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఈ విత్తనాలను అద్భుతమైన ఔషధంగా చెబుతారు. వీటిని కూడా ఒక మూలికగా పరిగణిస్తారు. నేరేడు విత్తనాల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ విత్తనాలను పలు ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. అయితే మనకు మార్కెట్లో నేరేడు విత్తనాలకు చెందిన పొడి లభిస్తుంది. దీన్ని వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనకు అనేక లాభాలను అందిస్తుంది.
నేరేడు విత్తనాల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. భోజనానికి 30 నిమిషాల ముందు దీన్ని తాగాలి. రోజుకు 2 సార్లు ఇలా తాగాల్సి ఉంటుంది. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నేరేడు విత్తనాలను ఈ విధంగా పొడి చేసి ఉపయోగిస్తే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పొడిలో జంబోలైన్, జంబోసైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. ఈ పొడిని రోజూ తీసుకోవడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. డయాబెటిస్ కారణంగా రోగుల్లో ఉండే అతిదాహం, అతి మూత్ర విసర్జన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
నేరేడు విత్తనాల పొడిని తీసుకోవడం వల్ల శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ఈ పొడి యాస్ట్రింజెంట్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. ముఖ్యంగా పేగుల్లో వచ్చే వాపులు తగ్గిపోతాయి. విరేచనాల నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు నయమవుతాయి. ఆయా భాగాల్లో ఉండే మ్యూకస్ పొర రక్షించబడుతుంది. ఈ విత్తనాల పొడిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. రక్త నాళాల వాపులు తగ్గి గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
నేరేడు విత్తనాల పొడిని రోజూ తీసుకుంటే లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నేరేడు గింజల పొడిని రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నీళ్లు లేదా మజ్జిగలో కలిపి తాగవచ్చు. షుగర్ ఉన్నవారు ఆహారానికి 30 నిమిషాల ముందు తాగితే మంచిది. లేదంటే ఆహారం తీసుకున్న తరువాత 60 నిమిషాలు విరామం ఇచ్చి తాగాలి. ఇలా నేరేడు విత్తనాల పొడిని వాడడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.