Turmeric And Honey Benefits | పసుపు, తేనె.. ఇవి రెండూ ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. పసుపును మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. శుభ కార్యాల సమయంలోనూ పసుపు వినియోగం ఎక్కువగానే ఉంటుంది. ఇక తేనెను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. అయితే ఈ రెండింటి మిశ్రమం అద్భుతాలు చేస్తుందని చెప్పవచ్చు. పసుపు, తేనె కలిపి తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండింటి మిశ్రమం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీంతో పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇక పసుపు, తేనె తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
పావు టీస్పూన్ పసుపుతో ఒక టీస్పూన్ తేనె కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని సంరక్షిస్తాయి. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కీళ్లు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని వాపులు కూడా తగ్గుతాయి.
పసుపు, తేనె మిశ్రమం ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే విటమిన్ ఎ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాలను రక్షిస్తాయి. దీంతోపాటు ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. పసుపు, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. దీంతోపాటు సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఒళ్లు నొప్పులు సైతం తగ్గుతాయి.
పసుపు, తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం తినే కొవ్వు పదార్థాలను శరీరం సరిగ్గా జీర్ణం చేస్తుంది. అలాగే ఈ మిశ్రమం సహజసిద్ధమైన లాక్సేటివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే సుఖ విరేచనం అయ్యేలా చేస్తుందన్నమాట. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణవ్యవస్థలోని మంచి బాక్టీరియా సైతం పెరుగుతుంది. దీంతో శరీరం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకుంటుంది.
పసుపు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం ప్రకాశిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మెదడు పనితీరు సైతం మెరుగు పడుతుంది. దీంతో మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా పసుపు, తేనె మిశ్రమం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక దీన్ని రోజూ తీసుకోవడం మరిచిపోకండి.