మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. వ్యాయామాలు అన్ని వయసుల వారికి అవసరం. నిత్యం వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉండటంతోపాటు వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతాం. ఈ క్రమంలో చాలా మంది తమకు అనువైన వ్యాయామాలను ఎంచుకుని నిత్యం సాధన చేస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారు భిన్న రకాల వ్యాయామాలు చేస్తుంటారు.
ఈ క్రమంలో ఎవరైనా సరే.. కింద తెలిపిన పలు వ్యాయామాలు చేస్తే అధికంగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. మరి క్యాలరీలను అధికంగా ఖర్చు చేసే ఆ వ్యాయామాలు ఏమిటంటే..
1. కనీసం 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే 180 నుంచి 266 క్యాలరీలు ఖర్చవుతాయి. అలాగే స్విమ్మింగ్ వల్ల శారీరక దృఢత్వం ఏర్పడుతుంది. అధిక బరువు తగ్గుతారు.
2. రాక్ క్లయింబింగ్ చేయడం వల్ల కూడా అధికంగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. శరీరంలో అధికంగా క్యాలరీలు ఖర్చవుతాయి. శక్తి త్వరగా అయిపోతుంది. దీంతో శారీరక శ్రమ జరిగి చక్కని వ్యాయామం చేసినట్లవుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.
3. జాగింగ్ చేయడం వల్ల కూడా క్యాలరీలను అధికంగా ఖర్చు చేయవచ్చు. కనీసం 30 నిమిషాట పాటు జాగింగ్ చేస్తే సుమారుగా 400 క్యాలరీలు ఖర్చవుతాయి.
4. జంపింగ్ రోప్స్ వల్ల 30 నిమిషాలకు 300 నుంచి 444 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో బరువు త్వరగా తగ్గుతారు.
5. సైకిల్ తొక్కడం వల్ల 30 నిమిషాలకు సుమారుగా 466 క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో శరీరానికి చక్కని వ్యాయామం అవుతుంది.
6. ఎరోబిక్స్ చేయడం వల్ల 30 నిమిషాలకు 400 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
7. జంపింగ్ లంగ్స్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరగడమే కాకుండా ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తాయి.
8. పుష్-అప్లు, వాకింగ్ ప్లాంక్‌లు, సింగిల్-లెగ్ హోపింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. వాకింగ్ తరువాత కాసేపు వీటిని సాధన చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు.
9. శరీరంలో మెటబాలిజం వృద్ధి పొందడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చు. మిర్చి, గ్రీన్‌టీ, దాల్చిన చెక్క, అల్లం నిత్యం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
10. సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా క్యాలరీలను బాగా ఖర్చు చేసే వీలుంటుంది.