Vitamin D | మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ద్వారా అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందాలి. ఏ ఒక్కటి తక్కువైనా మన శరీరం పనితీరు కుంటుపడిపోతుంది. తద్వారా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మందులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆహారాల ద్వారా అన్ని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో ఎముకల సాంధ్రత తగ్గిపోతుంటుంది. అలాగే, వివిధ వ్యాధుల కారణంగా కూడా ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. ఎముకలను బలంగా ఉంచుకోవాలంటే కాల్షియం అవసరం. అయితే, మన ఆహారాల ద్వారా అందే కాల్షియంను శరీరం గ్రహించాలంటే తప్పనిసరిగా డీ విటమిన్ కావాల్సిందే.
డీ విటమిన్ ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది సూర్యరశ్మి వల్ల లభిస్తుంది. ఆహారం నుంచి కూడా శరీరానికి అందివ్వొచ్చు. సప్లిమెంట్స్ ద్వారా కూడా పొందవచ్చు. మనం తీసుకునే ఆహారాల్లోని కాల్షియంను శరీరం గ్రహించాలంటే డీ విటమిన్ తప్పనిసరి. డీ విటమిన్ లోపంతో చిన్నారుల్లో రికెట్స్ వ్యాధికి దారితీయగా.. పెద్ద వారిలో ఎముకలు పెళుసుబారే సమస్య కనిపిస్తుంది. డీ విటమిన్ అందడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. న్యూరోలాజికల్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
డెఫీషియెన్సీ రిస్క్
ఇక డీ విటమిన్ డెఫీషియెన్సీ కారణంగా రొమ్ము, కొలన్, ప్రొస్టేట్ క్యాన్సర్లతో పాటు గుండె సంబంధ వ్యాధులు, డిప్రెషన్, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎముకలు గుళ్లబారుతాయి. దంత సమస్యలు వస్తాయి. న్యూరో సమస్యలు కూడా కనిపిస్తాయి.
డెఫీషియెన్సీ సింప్టమ్స్
డీ విటమిన్ డెఫీషియెన్సీ కారణంగా ఒంట్లో నొప్పులు వస్తాయి. అలసటగా ఉంటుంది. కండరాలు నొప్పిపెడతాయి. కింద కూర్చుని లేవడం ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రెస్ ఫ్రాక్చర్స్ కనిపిస్తాయి. మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
డీ విటమిన్ ఫుడ్స్
డీ విటమిన్ పొందడానికి సూర్యరశ్మి కరెక్ట్ సోర్స్. చేపలు తినడం వల్ల కూడా డీ విటమిన్ పొందవచ్చు. కాడ్లివర్ ఆయిల్, గుడ్డు పచ్చసొన, ఫోర్టిఫైడ్ మిల్స్, ఫోర్టిఫైడ్ సెరల్స్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్న నుంచి కూడా డీ విటమిన్ లభిస్తుంది.
నోట్ : విటమిన్ సీ, డీ అనేక మల్టీవిటమిన్లలో కలిసి ఉంటాయి. వీటి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.