న్యూఢిల్లీ : ప్లాంట్ బేస్డ్ డైట్ (Plant Based Diet) పేరుకు తగ్గట్టే మొక్కల నుంచి సేకరించిన ఆహారం ఆరోగ్యానికి మేలైనదని పలువురు ఈ డైట్‌ను ఫాలో అవుతుంటారు. మాంసం, పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులను పక్కనపెట్టి మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకునే వారు పెరుగుతున్నారు. ఈ తరహా ఆహార నియమాలను అనుసరించేవారు వారానికి తగిన ప్రణాళికతో ముందుకెళితే ఆహార పదార్ధాల ఎంపిక సులువవుతుంది.
వీక్లీ మీల్ ప్లాన్ రూపొందించుకుని అందుకు అనుగుణంగా అవసరమైన పదార్దాలు, సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. వారంలో ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కు ఏమేం తీసుకోవాలో ఎంపిక చేసుకోవడం మేలు. ఈ క్రమంలో పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రొటీన్లను భాగం చేసుకోవాలి. వారానికి సరిపడా అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు లిస్ట్ తయారుచేసుకోవాలి.
తాజా సరుకులను, తోఫు, లెంటిల్స్, నట్స్ వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్లను సిద్ధం చేసుకోవాలి. ఇక ప్రాసెస్డ్ ఫుడ్ స్ధానంలో పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే మొక్కల ఆధారిత ఆహారంలో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ12 వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
Read More :