Improve Memory | జ్ఞాపకశక్తి కోల్పోతున్నారా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Improve Memory | వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా, కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉండేలా చేసుకోవడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు.
Improve Memory | జ్ఞాపకాలే మనల్ని బతికిస్తుంటాయి. జ్ఞాపకాలమే మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి. జ్ఞాపకాలే బంధాలు, అనుబంధాలు పెరిగేలా చేస్తుంది. ప్రస్తుత కాలంలో మన జీవనశైలి కారణంగా జ్ఞాపకశక్తి సమస్యలను కూడా ఎదుర్కొటున్నాం. జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండటం, మెదడును పదును పెట్టడం ఎలా అన్నది పెద్ద సమస్యలా తయారైంది. ముదిమి వయసులో రావాల్సిన సమస్యలు యుక్త వయసులోనే రావడంతో జీవితంలో ముందుకెళ్లలేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీని నివారణ కోసం చిట్కాలు మీ కోసం..
మన అనుభూతికి వచ్చిన వస్తువు లేదా సంఘటన మెదడులో భద్రంగా ఉండటమే జ్ఞాపకశక్తి. మెదడు జ్ఞాపకాల్ని సంకేతాల రూపంలో భద్రపరుచుకుంటుంది. అవసరమైన సందర్భాల్లో జ్ఞాపకాలను యథాతథంగా అందిస్తుంది. మన జ్ఞాపకశక్తి అపరిమతిమైనది. అయితే, ఎన్నో అవరోధాలు, ఆరోగ్య సమస్యల కారణంగా మతిమరుపు వస్తుంది. ఇది అల్జీమర్స్ వరకు దారితీసే ప్రమాదం ఉంటుంది. తెలిసిన వ్యక్తి పేరును మర్చిపోవడం, చేయాల్సిన పని గుర్తుపెట్టుకోకపోవడం, చేసిన పనినే మళ్లీ చేయడం వంటివి మన జ్ఞాపకశక్తి శక్తిలో వచ్చే కొన్ని మార్పులు మన వృద్ధాప్యాన్ని సూచిస్తుంటాయి. ఇవి మెదడు మారుతున్న పనితీరు, ఫలితాన్ని చెప్తుంది. జ్ఞాపకశక్తి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల హార్మోనుల అసమతుల్యత వల్ల కూడా జ్ఞాకపశక్తి తగ్గే అవకాశాలున్నాయి.
శారీరక శ్రమ
శారీరకంగా చురుకుగా ఉండటం అనేది మన ప్రాధాన్యతలను బట్టి పూర్తి స్థాయి వర్కవుట్లు, యోగా, కార్డియో లేదా జాగింగ్, మెడిటేషన్ లేదా వాకింగ్ వంటి చిన్నపాటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండవచ్చు. శారీరక శ్రమ మెదడుకు మెరుగైన ఆక్సిజన్‌ను అందించడమే కాకుండా మెరుగైన రక్త ప్రసరణలో సహాయపడుతుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిచేస్తూ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి.
మానసిక వ్యాయామాలు
మనం ఎంత ఎక్కువ పని చేస్తే మన మెదడు అంత బలంగా మారుతుంది. అందుకని, కొత్త భాష, సంగీతం, ఆర్ట్ వేయడం నేర్చుకోవడం వంటి ప్రక్రియల ద్వారా మనస్సును సవాలు చేయవచ్చు. ఇది కొత్త నైపుణ్యం లేదా అభిరుచిని పొందడమే కాకుండా మెదడుకు పని చెప్తుంది. క్రాస్‌వర్డ్ పజిల్స్, సుడోకు మొదలైన ఆటలను ఆడటం, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటి వలన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మనస్సును పదును పెట్టడం అనేది అద్భుతమైన మానసిక వ్యాయామాలుగా పరిగణించాలి.
సాధనాల ఉపయోగించడం
కొత్త సమాచారాన్ని పొందేటప్పుడు మైండ్ ప్యాలెస్, జ్ఞాపిక పరికరాలు, ఎక్రోనిమ్స్ వంటి సాధనాలను ఉపయోగించడం వలన మరింత సమర్థవంతంగా జ్ఞాపకాలను నిల్వ చేయడం, తిరిగి పొందడంలో సహాయపడుతుంది. మైండ్ ప్యాలెస్ అంటే.. మనకు తెలిసిన ప్రదేశాలను గుర్తుంచుకోవడం, ఆ స్థలాలను నెమరేసుకోవడం, వాటికి మరిన్ని వివరాలను జోడించడం వల్ల మెదడును చురుకుగా ఉంచుకోవచ్చు. జ్ఞాపకాలు, ఎక్రోనిమ్స్ సంక్షిప్తంగా నిల్వ చేసి తిరిగి పొందడాన్ని సులభతరం చేసే కొన్ని సాధనాలుగా చెప్పుకోవచ్చు.
సమాచార సేకరణ
సేకరించిన కొత్త సమాచారాన్ని ఇప్పటికే తెలిసిన విషయాలతో జత చేయాలి. వీటి ద్వారా పొందే కొత్త సమాచాదాన్ని మెమరీలో నిల్వ చేసుకుంటూ పోతుండాలి. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సాయపడుతుంది. కొత్త సమాచారం ఇంతకు ముందు నేర్చుకున్న దానితో ఎలా సంబంధం కలిగి ఉందో విశ్లేషించడానికి సమయాన్ని వెచ్చించడం ద్వారా లోతుగా అర్థం చేసుకోవడానికి, మెదడును పదును పెట్టడానికి అవకాశం లభిస్తుంది.
రాత్రి నిద్ర పోయే ముందు దినపత్రికగానీ, మ్యాగజైన్గానీ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పాలకూర, గోంగూర, మునగాకు, క్యారెట్, గోబి వంటి ఆహారాలు తింటుండాలి. పాలు, చీజ్, పెరుగు, బట్టర్ వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ప్రతిరోజు భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో యోగ, మెడిటేషన్‌తో పాటు తేలికపాటి వ్యాయామాలు సాధన చేయాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

