శ్వాస వ్యవస్థలో ముక్కు ప్రధానమైనది. కొన్ని రకాల వైరస్ల కారణంగా జలుబు చేసి ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతుండటం మనం చూస్తుంటాం. ముక్కులో ఉండే అతి సున్నిత త్వచాలు ఉబ్బడంతో ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. దాంతో ముక్కును బలంగా చీదుతూ ఉండటంతో మరింత వాచిపోతుంది. అలాగే నీరు కూడా కారుతూ మనకు మరింత ఇరిటేషన్ను కలుగజేస్తుంది. కొందరిలో జలుబు కనిపించదు. కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది. దీంతో గాలి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ముక్కులోని సైనస్ కండరాలు వాచి ఇబ్బంది పెడుతున్నా, ముక్కు నుంచి నీరు కారుతున్నా రెండు, మూడు గంటలకు ఒకసారి ముక్కును శుభ్రం చేసుకోవాలి.
గోరు వెచ్చని నీటిని కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం నీటి నుంచి కొన్ని చుక్కలను తీసుకుని ముక్కు రంధ్రాల్లో వేయాలి. దీంతో ముక్కులో ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఫలితంగా ముక్కు రంధ్రాలు క్లియర్ అయి శ్వాస సరిగ్గా ఆడుతుంది.
రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా నలిపి వాటిని అలాగే తిన్నా లేదంటే వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసి గోరు వెచ్చని నీటిలో ఆ మిశ్రమాన్ని కలిపి తాగినా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
ముక్కు దిబ్బడను తగ్గించేందుకు ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
మరుగుతున్న నీటిలో పెప్పర్మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపి రోజుకు 3 పూటలా తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆ మిశ్రమంలో తేనె కలిపితే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది.
గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణం కొన్ని చుక్కలను ముక్కులో వేసుకోవడం ద్వారా ముక్కు శ్లేషం సన్నబడి దిబ్బడ సమస్య తగ్గిపోతుంది.
2 టీ స్పూన్ల నిమ్మ రసం, నల్ల మిరియలు, ఉప్పును మిశ్రమంగా చేసుకుని ముక్కుపై అప్లై చేయడం ద్వారా ముక్కు దిబ్బడ సమస్య దూరమవుతుంది.
సోంపు, గడ్డి చామంతి, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని కలిపి ముక్కుపై రాయాలి. కొంత సేపటికి ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
యూకలిప్టస్ లేదా థైమ్ వంటి నూనెల సారాన్ని పీల్చడం ద్వారా ముక్కులో ఉన్న అడ్డంకులను తొలగించుకోవచ్చు.
నిత్యం రెండు సార్లు టమాటా జ్యూస్‌ను తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.
నానవెజ్ తీసుకునేవారు చికెన్ సూప్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల వీటిలోని విటమిన్ సీ ఉపశమనం పొందేలా చేస్తుంది.
ముక్కు దిబ్బడతో బాధపడే వారు వీలైనంత వరకు పాలు, పాల ఉత్పత్తులను దూరం పెట్టాలి.
ధూమపానం అలవాటును మానుకోవాలి. దీని కారణంగా శ్వాస సమస్యలు పెరుగుతాయి.