Sun Stroke: ఎండలో బయటకి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి
బయట ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో బయటకు వెళ్తే డీహైడ్రేట్ అవడం ఖాయం. ఎండపూట బయటకు వెళ్లాలనుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Sun Stroke: బయట ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో బయటకు వెళ్తే డీహైడ్రేట్ అవడం ఖాయం. ఎండపూట బయటకు వెళ్లాలనుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎండలో పనిచేసేవారు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
సమ్మర్లో చల్లదనం కోసం మద్యం తాగితే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ మద్యం తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. మద్యానికి బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం మంచిది.
ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించని తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటే మంచిది. తద్వారా ఎండవేడి తగలకుండా ఉంటుంది.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడే పనులు చేసుకునేలా ప్రణాళికలు తయారుచేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండకు వెళ్లకుండా ఉంటే మరీ మంచిది.
ఏదైనా పని మీద ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నీళ్ల బాటిల్తో పాటు ఉప్పు కలిపిన మజ్జిగ లేదా నిమ్మరసం వెంట తీసుకెళ్తే మంచిది. ఓఆర్ఎస్ అప్పుడప్పుడూ తాగుతూ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
ఇంట్లో ఉన్నా సరే గంటకోసారి వివిధ రకాల ద్రావణాలు తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, బత్తాయి, నిమ్మరసం తీసుకుంటే శరీరానికి లవణాలు, పొటాషియం లాంటివి అందుతాయి.
ఎండలో బయటకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ లాంటివి వెంట తీసుకెళ్లాలి. ఫలితంగా వడదెబ్బకు గురికాకుండా ఉంటారు.