మా బాబు వయసు మూడు నెలలు. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మూడు కేజీల బరువు ఉన్నాడు. కానీ, ఈ మధ్య వ్యాక్సిన్ కోసం తీసుకెళ్లినప్పుడు.. బిడ్డ ఎడమవైపు వృషణం కిందికి దిగలేదని, పొట్టలోనే ఉండిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఇదేమైనా ప్రమాదకరమా?
మీరు చెబుతున్న పరిస్థితిని ‘అన్ డిసెండెంట్ టెస్టిస్’ అంటారు. అంటే, పొట్టలోనే ఉండిపోయిన వృషణం. నిజానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు వృషణాలు బిడ్డ పొట్టలోనే ఉంటాయి. ప్రసూతి చివరి దశ నాటికి కిందికి (క్రోటల్ మసాక్స్) దిగుతాయి. కానీ కొంతమంది పిల్లలలో.. ఏవో కారణాల వల్ల ఒక వృషణం మాత్రం కిందికి దిగదు. పొట్టలోనో, గజ్జల భాగంలోనో మిగిలిపోతుంది. అది కూడా మూడు నాలుగు నెలల్లో సర్దుబాటు అవుతుంది. ఇలా జరగకపోతే, సర్జరీ ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు. అలానే వదిలేస్తే.. భవిష్యత్లో క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. వంధ్యత్వానికి దారితీయవచ్చు. తొమ్మిది నెలల నుంచి ఏడాది వయసులో ఓ చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్