Digestive Health | గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించే మిశ్రమం ఇది.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే..
ఉదయం నిద్ర లేవగానే పొట్ట ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపించడం వంటి జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. చాలా మంది ఈ సమస్యలకు మందులు వాడుతూ ఉంటారు. అయితే రోజంతా ఉత్సాహాన్ని తగ్గించే ఈ సమస్యలకు క్లిష్టమైన డైట్లు లేదా సప్లిమెంట్స్ అవసరం ఇకపై అవసరం పడకపోవచ్చు.
Digestive Health | ఉదయం నిద్ర లేవగానే పొట్ట ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపించడం వంటి జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. చాలా మంది ఈ సమస్యలకు మందులు వాడుతూ ఉంటారు. అయితే రోజంతా ఉత్సాహాన్ని తగ్గించే ఈ సమస్యలకు క్లిష్టమైన డైట్లు లేదా సప్లిమెంట్స్ అవసరం ఇకపై అవసరం పడకపోవచ్చు. సాధారణంగా ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండు, నిమ్మరసం, రాక్ సాల్ట్ (సేంద్రీయ ఉప్పు) ను ఉపయోగించి ఈ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సహజంగా ప్రారంభమవుతుంది. ఇది పొట్టపై ఒత్తిడి లేకుండా, నెమ్మదిగా జీర్ణవ్యవస్థను చురుకుగా చేస్తుంది.
తయారు చేయడం ఇలా..
అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. కొంచెం గట్టిగా ఉన్న అరటి పండును తీసుకుని, దానిపై తాజా నిమ్మరసం పిండాలి. తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ చల్లి కలిపి తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలు కలిపి ఒక ప్రభావవంతమైన జీర్ణవ్యవస్థ-ఫ్రెండ్లీ ఆహారంగా పనిచేస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో ఏర్పడే ఉబ్బరం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ సమస్యలు తగ్గి, మలబద్ధకం నుంచి బయట పడవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా సమతుల్యం కాపాడటానికి కూడా ఇది సహాయపడుతుంది. అరటి పండులో ఉండే ప్రీబయోటిక్ ఫైబర్ గట్ (జీర్ణ వ్యవస్థ)లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది మలవిసర్జనను సులభతరం చేస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాక్ సాల్ట్ పొట్టలో ఆమ్ల ఉత్పత్తిని సపోర్ట్ చేసి గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది.
ఏ సమయంలో..
ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ రోజును సహజంగా ప్రారంభిస్తుంది. అవసరమైతే కొన్ని నానబెట్టిన బాదం పప్పులతో కలిపి తీసుకోవచ్చు, ఇది శక్తి స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే, అరటి పండు చాలా ముదురు కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్నదాన్ని ఎంపిక చేయడం మంచిది. అలాగే ఏదైనా జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం అవసరం. చిన్న చిన్న ఆహారపు అలవాట్లు కూడా రోజువారీ జీర్ణక్రియపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఈ సులభమైన మిశ్రమాన్ని అలవాటు చేసుకుంటే పొట్ట తేలికగా ఉండటమే కాకుండా, రోజంతా సౌకర్యంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

