Health Tips | మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 7 అలవాట్లకు దూరం కావాల్సిందే !
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా చురుకుగా (Health Tips) ఉండటమూ అంతే ముఖ్యం. మెదడు ఆరోగ్యం కాపాడుకుంటూ శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా జీవితాన్ని గడిపితేనే పూర్తి ఆరోగ్యవంతులుగా దీర్ఘాయువును సొంతం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా చురుకుగా (Health Tips) ఉండటమూ అంతే ముఖ్యం. మెదడు ఆరోగ్యం కాపాడుకుంటూ శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా జీవితాన్ని గడిపితేనే పూర్తి ఆరోగ్యవంతులుగా దీర్ఘాయువును సొంతం చేసుకోవచ్చు.
మూడు పౌండ్ల మెదడు మానవ శరీరంలో అత్యంత సామర్ధ్యం కలిగిన సంక్లిష్ట అవయవం. ఇంతటి కీలకమైన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన దైనందిన అలవాట్లను, జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దైనందిన అలవాట్లు అనారోగ్యకరమైనవైతే అది మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బ్రైన్ హెల్త్‌ను కాపాడుకోవాలంటే ఏడు అలవాట్లను వదిలించుకుని ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలి.
బద్ధకం : శరీరానికి ఎలాంటి వ్యాయామం లేకుండా రోజంతా లేజీగా గడపడం బీపీ, మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులతో పాటు దీర్ఘకాలంలో డిమెన్షియా ముప్పును పెంచేందుకు దారితీస్తుంది.
నిద్రలేమి : రరరోజంతా అలిసిసొలసి పనిచేసిన వారు సైతం రాత్రి పొద్దుపోయేవరకూ కబుర్లు, టీవీలు, సినిమాలతో కాలక్షేపం చేయడంతో నిద్ర కరువవుతోంది. రోజుకు 7-8 గంటలు కంటి నిండా నిద్రలేకుంటే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. నిద్రలేమి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఒత్తిడి : ఆధునిక జీవితంలో ప్రతిఒక్కరూ ఒత్తిడితో చిత్తవుతున్నారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో టెన్షన్లు, టార్గెట్లతో ఉరుకుల పరుగుల జీవనశైలితో ఒత్తిడి బారినపడుతున్నారు. ఒత్తిడి పలు అనారోగ్యాలకు దారితీసి మెదడు పనితీరునూ మందగించేలా చేస్తుంది.
స్క్రీన్‌టైం : స్మార్ట్ఫోన్ల రాకతో ప్రతి ఒక్కరూ ఓ టైం అంటూ లేకుండా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలకు అతుక్కుపోతూ ఎక్కువ సమయం బ్లూలైట్‌కు అంకితమవుతున్నారు. ఇది మెదడు కణజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
అతిగా తినడం : ఆధునిక జీవనశైలిలో జంక్ ఫుడ్ తీసుకోవడంతో పాటు అతిగా తినడం అలవడుతోంది. అతిగా తినడం ఊబకాయంతో పాటు ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇది జ్ఞాపకశక్తి మందగించడం, కాగ్నిటివ్ డిక్లైన్ ముప్పు పెంచుతుంది.
శబ్ధాల హోరు : భారీ శబ్ధాల హోరు అధికం కావడం, మ్యూజిక్ హైవాల్యూమ్తో వినడం వల్ల చెవులు దెబ్బతినడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ ఇది అల్జీమర్స్ ముప్పు పెంచుతుంది.
ప్రతికూల ఆలోచనలు : బబిజీ లైఫ్‌లో ఇప్సుడు అందరినీ నెగెటివ్ థింకింగ్ వేధిస్తోంది. ప్రతికూల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతికూల ఆలోచనలు, నిరంతర ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
Read More :
Heart Surgery | రోజుల బిడ్డకు గుండె ఆపరేషనా? పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- brain
- habits
- health tips
- sleep
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

