బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 27, 2020 , 20:33:55

చిన్నత‌నంలో ఒత్తిడికి గురైతే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!

చిన్నత‌నంలో ఒత్తిడికి గురైతే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!

బాల్యం ప్ర‌తిఒక్క‌రికీ తీపి గురుతుగా ఉండాలి త‌ప్ప బాధాక‌రంగా గ‌డ‌వ‌కూడ‌దు. చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటే ముఖంలో చిరున‌వ్వు చిందించాలి. అలా ఉన్న‌వారి జీవితం అంతా ఆరోగ్య‌వంతంగా ఉంటారు. అంటే.. చిన్న‌పిల్ల‌లు ఒత్తిడికి గురైతే వారు పెరిగే కొద్ది దాని ప్ర‌భావం ఆరోగ్యం మీద ప‌డుతుంది. దీంతో గుండెపోటు, డ‌యాబెటిస్ వంటి వ్యాధుల బారిన ప‌డుతార‌ని అధ్య‌య‌నంలో తేలింది. అందుకే చిన్న‌పిల్ల‌ల‌ను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల మీద ఉంటుంది.

7, 11, 16, 23, 33, 42 ఏండ్ల వ‌య‌సున్న 7 వేలమంది మీద ప‌రిశోధ‌న జ‌రిపారు. వీరిలో ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి ల‌క్ష‌ణాల‌ను ప‌రిశోధ‌కులు సేక‌రించి అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత వెల్ల‌డించారు.  కాబ‌ట్టి పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే వారు బాల్యంలో ఆనందంగా ఉండేలా  చూసుకోవాలి. లేదంటే 30 ఏండ్లు వ‌చ్చేస‌రికి గుండె స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. 


logo