Health Tips : మానవ శరీరంలో నిరంతరం పనిచేస్తూ శరీరం నుంచి విషపూరిత వ్యర్ధాలను ఫిల్టర్ చేసే కిడ్నీల ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లను వదిలించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరం సరిగ్గా పనిచేసేందుకు మనం డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవాలి. రోజూ తగినంత నీరు తాగాలి. డీహైడ్రేషన్‌తో కిడ్నీలు దెబ్బతింటాయి.
ఇక సోడియం పరిమితంగా తీసుకోవాలి. రుచుల కోసం అతిగా ఉప్పు వాడితే రక్తపోటుకు దారితీసి కిడ్నీ ఫెయిల్యూర్‌కూ ముప్పుగా పరిణమిస్తుంది. ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఐటెమ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్‌ను పూర్తిగా మానివేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యపానంతో లివర్ డ్యామేజ్, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పొంచిఉంటుంది. ఇది కిడ్నీ డ్యామేజ్కూ దారితీస్తుంది.
మద్యంతో రక్తపోటు పెరిగి కిడ్నీ వైఫల్యం ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ఇక పెయిన్ కిల్లర్స్ తరచూ వాడటం కిడ్నీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా నాన్‌స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌తో కిడ్నీలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ధూమపానం అలవాటుతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడంతో పాటు కిడ్నీ క్యాన్సర్ ముప్పు కూడా అధికమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.