నెత్తి మీద చర్మం నుంచి సహజంగానే నూనె వంటి సెబమ్ స్రవిస్తుంది. ఇది చర్మాన్ని, వెంట్రుకలను కాపాడుతుంది. కొన్ని రోజుల తరబడి తలస్నానం చేయకుండా ఉంటే చర్మాన్ని సెబమ్ కాపాడలేదు. జిడ్డు స్వభావం కలిగిన సెబమ్లో గాలిలోని ధూళి, మృత కణాలు, పర్యావరణ కాలుష్యం కలిసిపోతాయి. అందువల్ల రోమాలు బయటికి వచ్చే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.
అప్పుడు బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మ జీవులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయాలి. తరచుగా తలస్నానం చేయకపోవడం వల్ల పేలు పడతాయి. ఫంగస్, బ్యాక్టీరియా ప్రభావం వల్ల దురద, అసౌకర్యం, దద్దుర్లు ఏర్పడతాయి.
ఈ సమస్య ఉన్నా సుదీర్ఘకాలం పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయకపోతే జుట్టు రాలిపోతుంది. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ కేశ సౌందర్యాన్ని పెంచుకునేందుకు తరచుగా తల స్నానం చేయాలి. సరైన షాంపునే ఎంచుకోవాలి. నెత్తికి పట్టిన మురికిని వదిలించుకునేందుకు బ్రష్‌ని ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ సమయం తలస్నానం చేయకుండా జాగ్రత్తపడాలి.