Obesity | రోజూ ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులతో ఊబకాయం.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..
ఊబకాయం అంటే ఎక్కువగా తినడం, తక్కువగా కదలడం వల్లే వస్తుందని చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే తాజాగా వెలువడుతున్న పరిశోధనలు మరో కీలక విషయాన్ని వెలుగులోకి తెస్తున్నాయి.
Obesity | ఊబకాయం అంటే ఎక్కువగా తినడం, తక్కువగా కదలడం వల్లే వస్తుందని చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే తాజాగా వెలువడుతున్న పరిశోధనలు మరో కీలక విషయాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. మనం రోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు, ఆహార ప్యాకేజింగ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీసి ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్)ను పెంచడంతోపాటు కొవ్వు నిల్వలను అధికం చేస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ రసాయనాలను ఒబిసోజెన్స్ (Obesogens) అని పిలుస్తారు. ఒబిసోజెన్స్ అంటే శరీరంలో కొవ్వు జీవక్రియను ప్రభావితం చేసే రసాయనాలు. సాధారణంగా ఆహారం ద్వారా లభించే శక్తిని శరీరం వినియోగించాల్సి ఉండగా, ఈ రసాయనాల ప్రభావంతో అదే శక్తి కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇవి ఈస్ట్రోజెన్, థైరాయిడ్, గ్లూకోకార్టికాయిడ్ వంటి హార్మోన్ల పనితీరును అనుకరించడం లేదా వాటి పనిని అడ్డుకోవడం ద్వారా జీవక్రియలలో మార్పులు తీసుకొస్తాయి.
ప్లాస్టిక్ ఉత్పత్తులే కారణం..
ఈ రసాయనాలకు ప్రధాన వనరు ప్లాస్టిక్ ఉత్పత్తులే. పాలీకార్బొనేట్ ప్లాస్టిక్లు, ఆహార డబ్బాల లోపలి పూతల్లో ఉపయోగించే బిస్ఫెనాల్-ఎ (BPA), ప్లాస్టిక్‌ను మృదువుగా ఉంచేందుకు ఉపయోగించే థాలేట్స్ (Phthalates) ను అత్యంత ఎక్కువగా అధ్యయనం చేసిన ఒబిసోజెన్స్గా గుర్తించారు. ప్లాస్టిక్ డబ్బాలను వేడి చేసినప్పుడు, ఎక్కువకాలం ఉపయోగించినప్పుడు లేదా ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని నిల్వ చేసినప్పుడు ఈ రసాయనాలు ఆహారంలోకి కలిసిపోయి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను కణాలు సరిగా స్వీకరించకపోవడం. ఇది టైప్-2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్‌కు ప్రధాన కారణంగా మారుతుంది. BPA వంటి రసాయనాలు క్లోమగ్రంథిలోని బీటా కణాలపై ప్రభావం చూపి అవసరానికి మించి ఇన్సులిన్‌ను విడుదల చేయిస్తాయి. ఈ పరిస్థితిని హైపర్ఇన్సులినీమియా అంటారు. దీర్ఘకాలంలో కణాలు ఇన్సులిన్‌కు స్పందించకుండా మారి ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.
కొవ్వు కణాలు వేగంగా నిర్మాణం..
అదే సమయంలో ఈ రసాయనాలు శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి. దీనివల్ల కొవ్వు నిల్వ సామర్థ్యం పెరిగి ఊబకాయం వచ్చే ప్రమాదం అధికమవుతుంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో మూత్రంలో థాలేట్స్ స్థాయిలు ఎక్కువగా ఉన్న పురుషుల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనాలు టెస్టోస్టెరాన్ పనితీరును కూడా ప్రభావితం చేసి జీవక్రియలలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. మరోవైపు బ్రునెల్ యూనివర్సిటీ లండన్, న్యూయార్క్ యూనివర్సిటీ, వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్ పరిశోధకులు నిర్వహించిన మెటా-విశ్లేషణలో చిన్న వయస్సులోనే తక్కువ మోతాదులో BPAకి గురైన జంతువుల్లో తర్వాతి జీవితంలో శరీర కొవ్వు, ట్రైగ్లిసరైడ్లు, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం అనుమతించిన భద్రతా పరిమితుల్లో ఉన్న మోతాదులే అయినప్పటికీ ఇలాంటి ప్రభావాలు కనిపించడం ఆందోళన కలిగించే విషయమని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని అలవాట్లు పాటించడం ద్వారా ఈ రసాయనాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని మైక్రోవేవ్‌లో వేడి చేయకుండా గాజు లేదా సిరామిక్ పాత్రలు ఉపయోగించడం మంచిది. తాగునీటిని కార్బన్ లేదా రివర్స్ ఆస్మోసిస్ (RO) ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసుకోవడం వల్ల మైక్రోప్లాస్టిక్‌లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసిన ప్రాసెస్డ్డ్ ఆహారాల కంటే తాజా, సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఒబిసోజెన్స్కు గురయ్యే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను నివారించాలంటే కేవలం వ్యాయామం, ఆహార నియంత్రణ మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించుకోవడం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Obesity
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

