Heart Attack | గుండెపోటుతో అర్ధంతరంగా తనువు చాలిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కదలికలు లేని జీవనశైలి, పోషకాలు కరువైన ఆహారం ఇందుకు ముఖ్యకారణాలు. వాటి విషయంలో జాగ్రత్త పడుతూనే మరో రెండు అంశాల మీద కూడా దృష్టి సారించాలని సూచిస్తున్నారు నిపుణులు. అవే.. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు ఓ సర్వే చేపట్టారు.
ఇందుకోసం లక్షమంది ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు బాధితులు త్వరగా గుండె జబ్బుకు లోనయ్యే ప్రమాదం ఉన్నట్టు తేలింది. అందులోనూ యాభై అయిదేండ్లకు మునుపే ఈ రెండు లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని హెచ్చరించారు.