మన శరీరంలో కణాలు నిరంతరం విభజనకు గురవుతూ ఉంటాయి. ఆ విభజనే జీవితానికి ఆలంబన. అదే క్యాన్సర్ లాంటి సమస్యలకు కారణం కూడా. కణవిభజన జరిగే సమయంలో జన్యువులు దెబ్బతినడం వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి కణవిభజనను గమనిస్తే, అక్కడ జరిగే లోపాలను గుర్తించి సరిచేయవచ్చన్నది శాస్త్రవేత్తల ఆశ. ఆ దిశగా కొన్ని అడుగులు పడ్డాయి కూడా! G1 అనే దశలో కణాలు విభజనకు గురవుతాయనీ, జన్యువుల్లో ఉండే కొన్ని క్రోమోజోములు ఈ తీరు సవ్యంగా ఉందా లేదా అన్నది గమనిస్తాయనీ తేలింది. ఇవి ఒక లైసెన్సింగ్ వ్యవస్థలా పనిచేస్తాయన్నమాట. అయితే నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇక్కడ ఎలాంటి పొరపాటు జరిగే అవకాశం ఉందో గుర్తించారు. దాని వల్లే జన్యువులు దెబ్బతిని లేనిపోని సమస్యలు సృష్టిస్తాయని నిరూపించారు. చిన్నగా కనిపించే ఈ పరిశోధన వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలకు దారి తీస్తుందని నమ్ముతున్నారు.