Foods For Heart Health | మన శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయడంతోపాటు వేళకు నిద్రించడం, తగినన్ని నీళ్లను తాగడం కూడా చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది రోజూ ఎంత వ్యాయామం చేసినా, వేళకు నిద్రించినా కూడా ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. సరైన ఆహారాన్ని తీసుకోరు. ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా సరైన ఆహారాన్ని తినకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది. ఇది వచ్చినట్లు కూడా తెలియదు. పైకి ఆరోగ్యంగానే కనిపిస్తారు. కానీ కొలెస్ట్రాల్ చాప కింద నీరులా ఎక్కువవుతుంది. ఇది చివరకు గుండె పోటును కలగజేస్తుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే మనం తినే ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకోవాలి.
రోజువారి ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి తినాలి. వెల్లుల్లి ఘాటు ఎక్కువగా ఉంటుంది అనుకుంటే కాస్త తేనె కలిపి తినవచ్చు. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె పోటు రాకుండా నివారించవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోజూ రాత్రి పూట భోజనం చేసిన అరంతరం ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి తినాలి. లవంగంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రానీయకుండా చూస్తాయి.
గుండె ఆరోగ్యానికి వాల్ నట్స్ ఎంతో దోహదం చేస్తాయి. గుప్పెడు వాల్ నట్స్‌ను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. ఇలా రోజూ వాల్ నట్స్‌ను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వాల్ నట్స్ వల్ల మెదడు యాక్టివ్‌గా కూడా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దానిమ్మ పండ్లు ఉపయోగపడతాయి. ఇవి రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగించి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. హార్ట్ బ్లాక్స్ ఏర్పడవు. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఆలివ్ నూనె ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ నూనెలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. గుండె పోటు రానీయకుండా చూస్తాయి. తరచూ ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. అలాగే రోజూ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఇవి కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తరచూ ఓట్స్‌ను తినాలి. వీటి వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. అలాగే ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్ లో తింటుండాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఈ విధంగా మీ ఆహారంలో పలు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ గుండె ఎల్లకాలం సురక్షితంగా ఉంటుంది.