Dry Skin | చలికాలంలో సాధారణంగా ఎవరికైనా సరే చర్మం పగులుతుంది. కానీ కొందరికి అన్ని సీజన్లలోనూ ఈ సమస్య ఉంటుంది. చర్మం పగిలేందుకు అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉండడం, మందులను ఎక్కువగా వాడడం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండడం వల్ల కూడా చర్మం పగులుతుంది. అయితే చర్మం పగిలే సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి పోషణను అందిస్తాయి. అలాగే పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు గాను పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.
క్యారెట్లు మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల క్యారెట్లను తింటే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. ఇది చర్మాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. చర్మానికి తేమ లభించి చర్మం పగలకుండా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే బీట్రూట్ను రోజూ తినడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారి ప్రకాశిస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు. బీట్ రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం పగలకుండా చూసుకోవచ్చు.
బ్రోకలిని ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి సంరక్షణను అందిస్తాయి. బ్రోకలిలోని విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మ కణాలకు మరమ్మత్తులను నిర్వహిస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొత్త చర్మ కణాలు వృద్ధి చెందుతాయి. చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చర్మాన్ని సంరక్షించడంలో నారింజ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని పగలకుండా చేస్తుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ పండ్లలోని విటమిన్ సి కూడా చర్మాన్ని పగలకుండా సురక్షితంగా ఉంచుతుంది. రోజుకు ఒక నారింజ పండును తింటున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు గాను రోజూ ఒక దానిమ్మ పండును కూడా తినవచ్చు. ఈ పండ్లలో నీరు అధిక మొత్తంలో ఉంటుంది. దీని వల్ల చర్మానికి తేమ లభిస్తుంది. చర్మం ఎల్లప్పుడూ మృదువుగా ఉంటుంది. చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. దానిమ్మ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి చర్మ కణాలకు నష్టం జరగకుండా చూస్తాయి. దీంతో చర్మం పునరుత్తేజం చెందుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా పలు రకాల ఆహారాలను రోజూ తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది.