Foods For Skin Health | మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక పోషకాలు అవసరం అవుతాయి. వాటిల్లో కొల్లాజెన్ కూడా ఒకటి. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుంది. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది చర్మాన్ని రక్షించడంతోపాటు కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కణజాలాన్ని సైతం రక్షిస్తుంది. అయితే కొల్లాజెన్ అనేది మన శరీరంలో తయారవుతుంది. అందుకు గాను పలు ఆహారాలను తినాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు, కీళ్లు కూడా దృఢంగా మారుతాయి. అయితే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మజాతికి చెందిన పండ్లను అధికంగా తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. సిట్రస్ పండ్లను తింటుంటే మనకు విటమిన్ సి లభిస్తుంది. ముఖ్యంగా నారింజ, నిమ్మ పండ్లను తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రోలిన్ను హైడ్రాక్సిప్రోలిన్గా మారుస్తుంది. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. దీంతోపాటు సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మం సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. చర్మం మృదువుగా మారుతుంది.
వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో కణజాలానికి మరమ్మత్తు జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే బెర్రీ పండ్లను తినడం వల్ల కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా చేపలు, సముద్రపు ఆహారాన్ని కూడా తరచూ తింటుండాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. దీంతోపాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
కోడిగుడ్డును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కోడిగుడ్డు తెల్లని సొనలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేందుకు దోహదం చేస్తాయి. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఆకుకూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఆకుకూరలను తినాలి. ముఖ్యంగా పాలకూరను తరచూ తింటుండాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం సురక్షితంగా ఉండి మృదువుగా మారుతుంది. పలు రకాల నట్స్, సీడ్స్‌ను తినడం వల్ల కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బాదంపప్పు, వాల్ నట్స్, పొద్దు తిరుగుడు విత్తనాలను తరచూ తింటుండాలి. వీటిల్లో జింక్, కాపర్, మన శరీరానికి అవసరం అయ్యే మినరల్స్ ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు.