Heart Health | మారిన ఆహారపు అలవాట్లు, నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటుండడం, అనారోగ్య సమస్యలు, వంశపారంపర్య సమస్యలు, పొగతాగడం, మద్యం సేవించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే గుండె పోటు వచ్చేందుకు కారణాలు ఎన్నో ఉంటున్నాయి. గుండెపోటు వస్తే మాత్రం ఇప్పుడు చాలా మంది బతకడం లేదు. అయితే గుండెపోటులో పలు రకాలు ఉంటాయి. సాధారణ గుండె పోటు అయితే మొదటి గంటలో వైద్య చికిత్స అందిస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ప్రాణాపాయం తప్పుతుంది. అయితే కార్డియాక్ అరెస్ట్ వస్తే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు. ప్రాణాలు పోతాయి. చాలా మందికి కార్డియాక్ అరెస్ట్ వస్తోంది. అందుకనే చనిపోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ రావొద్దు అనుకుంటే పలు ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఆ ఆహారాలు ఏమిటంటే..
వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి అలాగే తినేయాలి. అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చేయడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపు కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టనీయదు. దీంతో హార్ట్ ఎటాక్ రాదు. రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగుతుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
రోజూ 1-2 కప్పుల గ్రీన్ టీని తాగేవారిలో కూడా గుండె పోటు రాదని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాదు. కనుక గ్రీన్ టీని రోజూ తాగాలి. అయితే 2 కప్పులకు మించకూడదు. ఇక అవిసె గింజలు, చియా సీడ్స్ ను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఈ రెండు రకాల గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. కనుక రోజూ గుప్పెడు అవిసె గింజలు లేదా చియా సీడ్స్‌ను తినాలి. దీంతో ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
దాల్చిన చెక్కను రోజూ తీసుకుంటున్నా కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల శరీరంలో ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. దాల్చిన చెక్క పొడిని మీరు తినే ఆహారంపై చల్లి తినవచ్చు. లేదా ఓట్ మీల్, పెరుగు, టీ, కాఫీ వంటి వాటిలో కలిపి తాగవచ్చు. దీంతో గుండెను రక్షించుకోవచ్చు. అలాగే బాదంపప్పు, వాల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె పోటు రాకుండా చూస్తాయి. కాబట్టి రోజూ గుప్పెడు బాదంపప్పు లేదా వాల్ నట్స్‌ను తినాలి. అలాగే పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల కూడా గుండె పోటు రాకుండా ఉంటుంది. ఈ విధంగా పలు ఆహారాలను తింటుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.