Angi Ageing Foods | వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే చర్మం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. కానీ సెలబ్రిటీలు మాత్రం ఎంత వయస్సు వచ్చినా సరే వృద్ధాప్య ఛాయలు కనిపించవు. వారు ఎల్లప్పుడూ యవ్వనంగానే కనిపిస్తారు. మరి సాధారణ ప్రజలకు ఇది ఎందుకు సాధ్యం కాదు..? అంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. నివసిస్తున్న లేదా పనిచేస్తున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, వ్యాయామం, ఆహారపు అలవాట్లు, వ్యాధులు, ఒత్తిడి, ఆందోళన వంటివి వృద్ధాప్య ఛాయలు కనిపించేందుకు కారణం అవుతుంటాయి. అయితే సెలబ్రిటీలు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించడం వెనుక ప్రధాన కారణాలు రెండు ఉంటాయని చెప్పవచ్చు. ఒకటి వ్యాయామం చేయడం, రెండు పౌష్టికాహారం తీసుకోవడం. ఈ రెండింటి వల్లే వారు యవ్వనంగా కనిపిస్తారు. అయితే వ్యాయామం చేయడంతోపాటు పలు రకాల ఆహారాలను తీసుకుంటే ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా ఉండవచ్చని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకు పలు ఆహారాలు సహాయం చేస్తాయని వారు అంటున్నారు.
చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడంతోపాటు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేలా చేసే ఆహారాలను యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అంటారు. ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. కాంతివంతంగా మారి మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. కనుక యాంటీ ఏజింగ్ ఫుడ్స్‌ను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. పాలకూర, బ్రోకలీ లను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కనుక చర్మాన్ని రక్షిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కనుక వీటిని తరచూ తింటుండాలి. అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు టమాటాలను కూడా రోజూ తింటుండాలి. వీటిని మనం తరచూ కూరల్లో వేస్తుంటాం. కానీ టమాటాలను నేరుగా లేదా సూప్, జ్యూస్ రూపంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది. వీటితో ఫేస్ ప్యాక్‌లను తయారు చేసి కూడా వాడవచ్చు. టమాటాల్లో అధికంగా ఉండే లైకోపీన్ చర్మాన్ని హానికరమైన కిరణాల బారి నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
దానిమ్మ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గా చెప్పవచ్చు. దానిమ్మ పండ్లను తింటుంటే రక్తహీనత తగ్గుతుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. అలాగే బొప్పాయి కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. బొప్పాయి పండ్లను తరచూ తింటుంటే వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. అలాగే ఈ పండు గుజ్జును పలు ఫేస్ ప్యాక్‌లలోనూ ఉపయోగించవచ్చు. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
అవకాడోలను రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నా కూడా చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ ఎ, ఇ లతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటుంటే చర్మం సురక్షితంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. దీంతో చర్మానికి కాంతి లభిస్తుంది. అలాగే వీటిల్లో ఉండే కెరోటినాయిడ్స్ శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. దీంతో కణాలు సురక్షితంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఇలా ఆయా ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేయవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.