Red Wine | మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరూ చెబుతుంటారు. విపరీతంగా మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది కానీ వారం వారం మోతాదులో సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే రెడ్ వైన్‌ను తాగితే ఇంకా ఎక్కువ ఫలితం పొందవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. రెడ్ వైన్‌ను తాగడం అంత మంచిది కాదని కొందరు చెబుతుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం చూస్తే వారం వారం మోతాదులో తాగితే రెడ్ వైన్ ఆరోగ్య ప్రయోజనాలనే అందిస్తుందని వెల్లడైంది. రెడ్ వైన్‌లో మన శరీరానికి ఉపయోగపడే అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రెడ్ వైన్‌ను వారంలో 2 సార్లు తాగవచ్చని, ఒక్కోసారి 150 ఎంఎల్ వరకు సేవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల లాభాలే ఉంటాయని అంటున్నారు.
రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రెస్వెరెట్రాల్, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కాటెకిన్స్, ప్రో ఆంథో సయనైడిన్స్ కూడా రెడ్ వైన్‌లో ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మ కణాలు పునరుత్తేజం చెందుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. విదేశీయులు వైన్‌ను ఎక్కువగా సేవిస్తారు. అందుకనే వారు అంత అందంగా ఉంటారు. ఇక వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన రెస్వెరెట్రాల్, పాలిఫినాల్స్ రక్త నాళాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేట్లు చేస్తాయి. ఫలితంగా రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. రక్త నాళాల వాపులు సైతం తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం రెడ్ వైన్‌ను సేవిస్తుంటే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రెడ్ వైన్ ఎంతగానో మేలు చేస్తుంది. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం కారణంగా ఈ వైన్ ను సేవిస్తుంటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్ వంటి క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తరచూ రెడ్ వైన్ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. అయితే దీనిపై సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ రెడ్ వైన్ క్యాన్సర్‌కు ఔషధంగానే పనిచేస్తుందని ఇప్పటికీ చాలా మంది సైంటిస్టులు చెబుతుంటారు.
రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాల కారణంగా మెదడు కణాలు రక్షించబడతాయి. మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్తేజంగా ఉంటారు. రెడ్ వైన్‌లో ఉండే పాలిఫినాల్స్ ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అందువల్ల రెడ్ వైన్‌ను సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు జీర్ణశక్తి మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే రెడ్ వైన్‌ను తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా వారంలో 2 డ్రింక్స్‌కు మించి తాగకూడదని పరిశోధకులు సూచిస్తున్నారు. మోతాదుకు మించి తాగితే నెగెటివ్ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.