మనకు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. బొప్పాయి పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లను తింటే జీర్ణ సమస్యలు ఉండవు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే బొప్పాయి పండ్లను తింటే అనేక విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్‌లు మన శరీరానికి లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే బొప్పాయి పండ్లే కాదు, పచ్చి బొప్పాయి కాయలు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. పచ్చి బొప్పాయి కాయలను కొందరు పలు రకాల వంటల్లోనూ వేస్తుంటారు. పచ్చి బొప్పాయి కాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని అంటున్నారు.
బొప్పాయి పండ్లే కాదు, కాయలను తింటున్నా కూడా జీర్ణ సమస్యలు ఉండవు. పచ్చి బొప్పాయి కాయల్లోనూ పపైన్ అనే ఎంజైమ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వులు, ప్రోటీన్లను జీర్ణం చేసేందుకు సహాయం చేస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండదు. అసిడిటీ తగ్గుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి బొప్పాయి మనకు ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ఈ కాయలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆహారం తక్కువగా తింటారు. దీంతోపాటు శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్న వారు పచ్చి బొప్పాయి కాయలను తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
పచ్చి బొప్పాయి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అలాగే పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించుకోవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. పచ్చి బొప్పాయి కాయలను తింటుంటే షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. ఈ కాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అలాగే ఫైబర్ ఈ కాయల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను పెరగకుండా చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
పచ్చి బొప్పాయి కాయల్లో విటమిన్లు ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాయల్లో ఉండే ఎంజైమ్‌లు చర్మ కణాలను సంరక్షిస్తాయి. దీంతో మొటిమలు, ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. చర్మంలో సహజసిద్ధమైన కాంతి పెరుగుతుంది. పచ్చి బొప్పాయి కాయను పేస్ట్‌లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా కూడా వేయవచ్చు. దీంతో ముఖంలో కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ కాయల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు మన శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలిస్తాయి. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా పచ్చి బొప్పాయి కాయలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.