Jasmine Tea | వేసవి కాలంలో అనేక రకాల పండ్లు మనకు తినేందుకు అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సీజన్లో మల్లె పువ్వులు కూడా ఎక్కువగానే వస్తాయి. మల్లె పువ్వుల్లో అనేక రకాలు ఉంటాయి. కానీ గుండ్రంగా ఉండే బొండు మల్లె పువ్వులు చాలా సువాసనా భరితంగా ఉంటాయి. ఈ మొక్క చాలా దూరంలో ఉన్నా సరే పువ్వుల వాసన మాత్రం ఘుమాళిస్తుంది. అయితే కేవలం అందానికే కాదు, మల్లె పువ్వులు ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. మల్లె పువ్వులతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మల్లె పువ్వులను ఎండబెట్టి నిల్వ చేయాలి. వాటిని కావాలకున్నప్పుడు ఉపయోగించాలి. ఎండిన మల్లె పువ్వులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మల్లె పువ్వుల టీని రాత్రి పూట తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి దూరమవుతుంది. మల్లె పువ్వుల టీని సేవించడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార కోరికలు కలుగుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. రతిలో చురుగ్గా పాల్గొంటారు. యాక్టివ్గా ఉంటారు. నాడీ మండల వ్యవస్థను ఉత్సాహ పరచడంలో మల్లె పువ్వుల టీ పనిచేస్తుంది. మల్లె పువ్వుల టీని మన దేశంలో చాలా మంది తాగరు. కానీ చైనా, జపాన్లో ఇది చాలా పాపులర్ టీ. అందుకనే వారు అంత అందంగా కూడా ఉంటారు. మల్లె పువ్వుల టీని సేవించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుంది. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
మల్లె పువ్వుల టీలో కాస్త పటిక బెల్లం లేదా తేనె కలిపి తాగవచ్చు. దీంతో టీ రుచిగా ఉంటుంది. అలాగే పోషక విలువలు కూడా పెరుగుతాయి. మల్లె పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ టీని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి మల్లె పువ్వుల టీ ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఈ టీని తరచూ తాగితే మేలు జరుగుతుంది. మల్లె పువ్వుల టీని సేవించడం వల్ల ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గుతుంది. హెచ్డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. దీని వల్ల రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
మల్లె పువ్వుల టీ పక్షవాతానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ టీని తరచూ సేవిస్తుంటే పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. మల్లె పువ్వుల టీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మల్లె పువ్వుల టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. మల్లె పువ్వుల టీని నోట్లో పోసి పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. జలుబు, దగ్గు, అలర్జీలు ఉన్నవారు ఈ టీని సేవిస్తుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇలా మల్లె పువ్వుల టీ మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు.