Japatri | మనం రోజూ చేసే అనేక వంటకాల్లో భాగంగా పలు రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ లేదా వెజిటేరియన్ మసాలా వంటలు చేసినప్పుడు కచ్చితంగా మసాలా దినుసులను వేయాల్సిందే. లేదంటే వంటకలకు చక్కని వాసన, రుచి రావు. ఇలా వంటకాలకు చక్కని వాసన, రుచిని అందించే మసాలా పదార్థాల్లో జాపత్రి కూడా ఒకటి. జాజికాయ పై పొరను ప్రత్యేకంగా తీసి దాంతో జాపత్రి తయారు చేస్తారు. ఇది ఇంకా అద్భుతమైన వాసనను, రుచిని కలిగి ఉంటుంది. కనుకనే మసాలా వంటకాల్లో జాపత్రిని కచ్చితంగా ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేద ప్రకారం జాపత్రి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
జాపత్రి నీళ్లను సేవించడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. జాపత్రిలో ఉండే కార్మినేటివ్ గుణాల కారణంగా ఇది పలు రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. విరేయనాలను అరికట్టడంలో, కడుపు నొప్పిని తగ్గించడంలో కూడా ఈ నీళ్లు పనిచేస్తాయి. జాపత్రిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తుంది. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. అలాగే బాహ్యంగా వచ్చే నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జాపత్రిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. జాపత్రిలో విటమిన్లు ఎ, సి, ఇతర సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో ఇన్ ఫెక్షన్లు, వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. జాపత్రి మన నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తుంది. జాపత్రి నీళ్లను సేవించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
జాపత్రిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే చిగుళ్ల వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిప్పి పన్ను సమస్య నుంచి బయట పడవచ్చు. జాపత్రి మన శరీరాన్ని సహజసిద్ధంగా డిటాక్స్ చేస్తుంది. అంటే శరీరంలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపిస్తుందన్నమాట. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. లివర్, కిడ్నలు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. జాపత్రి నీళ్లను రోజూ తాగుతుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఆకలి లేని వారు రోజూ ఈ నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. జాపత్రి చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌లలోనూ ఉపయోగించవచ్చు. ఇలా జాపత్రి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.