Honey And Cinnamon | తేనెను మనం తరచూ తీసుకుంటూనే ఉంటాం. దీన్ని పలు పానీయాల్లో కలిపి తాగుతుంటాం. అలాగే తీపి పదార్థాల తయారీలోనూ తేనెను ఉపయోగిస్తుంటారు. ఇక దాల్చిన చెక్కను కూడా మనం వంటల్లో వేస్తూనే ఉంటాం. మసాలా వంటకాల్లో దాల్చిన చెక్కను వాడుతాం. దీన్ని నేరుగా అలాగే వంటల్లో వేస్తారు. లేదా పొడిగా చేసి కూడా వంటల్లో వేస్తుంటారు. దాల్చిన చెక్కను వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన, రంగు వస్తాయి. అయితే తేనె, దాల్చిన చెక్క మిశ్రమం మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవాలి. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి మిశ్రమం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇది మనకు అనేక లాభాలను అందిస్తుంది.
తేనె, దాల్చిన చెక్క మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ మిశ్రమం యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. రెండింటిలోనూ పాలిఫినాల్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని రోజూ తింటుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు, ముక్క దిబ్బడ నుంచి ఉపశమరం లభిస్తుంది. ఈ మిశ్రమంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దగ్గు, గొంతు సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. తేనె, దాల్చిన చెక్క మిశ్రమం గాయాలు, పుండ్లను మాన్చడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. మొటిమలు తగ్గిపోతాయి. పలు రకాల చర్మ ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి.
తేనె, దాల్చిన చెక్క మిశ్రమం అలర్జీలు ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజూ తింటుంటే అలర్జీలు తగ్గిపోతాయి. అలాగే ఈ మిశ్రమంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి కనుక దీన్ని రోజూ తింటే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి సైతం బయట పడవచ్చు. ఇలా ఈ మిశ్రమం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది.