Fenugreek Seeds Sprouts | మెంతులను మనం రోజూ పలు రకాల వంటల్లో వేస్తుంటాం. ఆయుర్వేద పరంగా మెంతులు మనకు అనేక లాభాలను అందిస్తాయి. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులను ఉపయోగించి పలు ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే రోజూ మెంతులను నానబెట్టి తినాలని లేదా కనీసం మెంతుల నీళ్లను అయినా తాగాలని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అయితే మెంతులు కొందరికి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలను కలిగిస్తాయి. కనుక అలాంటి వారు మెంతులను తినలేరు. మెంతుల నీళ్లను కూడా తాగలేరు. కానీ వారితోపాటు ఎవరైనా సరే మెంతులను మొలకెత్తించి తినవచ్చు. ఇవి రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులను నీటిలో నానబెట్టి తరువాత వాటిని మొలకెత్తించి రోజూ ఒక కప్పు మోతాదులో తింటుండాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
మెంతులను మొలకెత్తించి తింటే వాటిల్లో ఉండే ఫైబర్, గలాక్టోమనన్, ఇతర సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో భోజనం చేసిన వెంటనే షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి మొలకెత్తిన మెంతులు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే ఇన్సులిన్‌ను శరీరం మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మొలకెత్తిన మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి సులభంగా జీర్ఱం అవుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. జీర్ణాశయంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అందులో ఉండే పోషకాలను సైతం శరీరం సులభంగా శోషించుకుంటుంది. దీని వల్ల పోషకాహార లోపం తగ్గుతుంది.
మొలకెత్తిన మెంతులను తినడం వల్ల క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ అధికంగా లభిస్తాయి. దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువును తగ్గించుకోవాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు రోజూ మొలకెత్తిన మెంతులను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
మొలకెత్తిన మెంతులను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె పోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే వీటిల్లో ఉండే పొటాషియం శరరీంలో రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. మెంతుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాచి. అందువల్ల వీటిని మొలకెత్తించి తింటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా మొలకెత్తిన మెంతులను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.