Walnuts | మన శరీరానికి పోషకాలను అందించే ఎన్నో రకాల ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా, తమ స్థోమతను బట్టి ఆయా ఆహారాలను తింటుంటారు. అయితే పోషకాల విషయానికి వస్తే మనకు నట్స్ ఎంతో దోహదం చేస్తాయని చెప్పవచ్చు. నట్స్‌లో వాల్ నట్స్ మనకు ఎక్కువ లాభాలను అందిస్తాయి. కానీ జీడిపప్పు, బాదంపప్పు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వాల్ నట్స్ ను వాటి రుచి కారణంగా చాలా మంది తినరు. అయినప్పటికీ వీటిల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. వాల్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్స్‌ను రోజూ నానబెట్టి తినాలని వారు సూచిస్తున్నారు. వాల్ నట్స్‌లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి.
వాల్ నట్స్‌లో ఆల్ఫా-లినోలీనిక్ యాసిడ్ (ఆలా) అనే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. అలాగే మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తాయి. వాల్ నట్స్‌లో ప్రోటీన్ల కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర కణజాలాన్ని పునర్నిర్మించేందుకు సహాయ పడతాయి. కణజాలం మరమ్మత్తులకు గురై ఆరోగ్యంగా ఉంటుంది. కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వాల్ నట్స్‌ను తీసుకోవాలి. వాల్ నట్స్‌లో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తొలగిపోతుంది.
వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా ఆరోగ్యంగా ఉంటాయి. వాల్ నట్స్‌ను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారి తేమగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. వాల్ నట్స్‌లో ఫోలేట్ (విటమిన్ బి9) అధికంగా ఉంటుంది. ఇది డీఎన్ఏ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాలు తయారయ్యేందుకు దోహదం చేస్తుంది. కనుక వాల్ నట్స్‌ను గర్భిణీలు తింటే శిశువులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. వారిలో పుట్టుక లోపం రాకుండా చూడవచ్చు.
వాల్ నట్స్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు రోజూ వాల్ నట్స్‌ను తింటుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే వాల్ నట్స్‌లో ఉండే మెగ్నిషియం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దీని వల్ల మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. వాల్ నట్స్‌లో అధికంగా ఉండే ఫాస్ఫరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వాల్ నట్స్‌ను రోజూ తినడం వల్ల వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇలా వాల్ నట్స్‌ను రోజూ తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.