Diabetes | రోజూ ఉదయాన్నే పరగడుపునే కరివేపాకు నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నీళ్లను తాగితే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ నీళ్లలో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నీళ్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఉదయం పరగడుపునే కరివేపాకు నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ ఉదయం కరివేపాకు నీళ్లను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరివేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ ఉదయం ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి సక్రమంగా ఉంటుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పొట్టలో ఏర్పడే అసౌకర్యం కూడా తగ్గుతుంది. కరివేపాకుల నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి ఈ నీళ్లు వరమనే చెప్పవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు ఈ నీళ్లను తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. ఈ నీళ్లను తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఎంత పనిచేసినా అసలు అలసిపోరు.
కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో చర్మం కాంతి సహజసిద్ధంగా పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ కరివేపాకుల నీళ్లను తాగడం వల్ల చర్మంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలు సైతం తగ్గుతాయి. దీంతో ముఖంపై ముడతలు ఉండవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. చర్మం తన సహజసిద్ధమైన నిగారింపును సొంతం చేసుకుంటుంది. చర్మ సమస్యలు ఉన్నవారు కరివేపాకుల నీళ్లను రోజూ తాగుతుంటే ఫలితం ఉంటుంది.
జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజూ కరివేపాకుల నీళ్లను తాగుతుండాలి. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా పెరుగుతుంది. పొడవుగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు, దురద, చుండ్రు నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. శిరోజాలు కాంతివంతంగా మారి ప్రకాశిస్తాయి. షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారు కరివేపాకు నీళ్లను రోజూ తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. షుగర్‌ను తగ్గించడంలో కరివేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్ పేషెంట్లు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. లేదా రోజూ కరివేపాకులతో నీళ్లను పెట్టుకుని తాగవచ్చు. ఎలా తీసుకున్నా షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇలా కరవేపాకుల నీళ్లను తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వీటిని మరిచిపోకుండా రోజూ తాగండి.