Carrot Juice | మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్లను చాలా మంది పచ్చిగా తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. క్యారెట్లను కూరల్లోనూ వేస్తుంటారు. చారు వంటి వాటిల్లో క్యారెట్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే క్యారెట్లను తినలేని వారు వీటిని జ్యూస్‌లా చేసి కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. క్యారెట్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. క్యారెట్లతో జ్యూస్ చేసి రోజూ ఉదయాన్నే తాగితే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. వ్యాధుల నుంచి బయట పడేస్తాయి.
క్యారెట్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో మన శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. ఉదయం క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోయి యాక్టివ్నెస్ పెరుగుతుంది. క్యారెట్ జ్యూస్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు నయం అవుతాయి. రోజంతా మీకు తాజాదనపు అనుభూతి కలుగుతుంది.
క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరరీంలో విటమిన్ ఎగా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో చర్మం మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. చర్మం డ్యామేజ్ అవకుండా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం సహజసిద్ధమైన నిగారింపును సొంతం చేసుకుని మెరుస్తుంది. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
క్యారెట్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. క్యారెట్లలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావనలో ఉంటారు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. క్యారెట్లను తింటున్నా లేదా జ్యూస్‌ను తాగినా మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో ఏకాగ్రత వస్తుంది. రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్‌ను సేవిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. బద్దకం పోతుంది. ఇలా క్యారెట్ జ్యూస్‌ను రోజూ ఉదయం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.