Almonds With Milk | ఆరోగ్యకరమైన పోషకాహారాల్లో బాదంపప్పులు ఎల్లప్పుడూ ముందుంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో బాదంపప్పు కూడా ఒకటి. బాదంపప్పు అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పప్పును రోజూ తింటుంటే అనేక లాభాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే బాదంపప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే బాదంపప్పును రాత్రి పూట నిద్రకు ముందు తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. ముఖ్యంగా 7 లేదా 8 బాదంపప్పులు రాత్రి పూట నిద్రకు ముందు తినాలి. అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోజూ రాత్రి పూట బాదంపప్పును తిని పాలను తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. మానసిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. బాదంపప్పులో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు బాదంపప్పు తిని పాలను తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. దీని వల్ల నిద్రకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉంటుంది.
బాదంపప్పులను తిని పాలను తాగితే శరీరంలో మెలటోనిన్ శాతం పెరుగుతుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట ఈ ఆహారాలను తీసుకుంటే మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. ఈ రెండింటిలోనూ క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కనుక ఈ రెండింటినీ రోజూ తీసుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు నిర్మాణమవుతాయి. దంతాల నొప్పి తగ్గిపోతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వల్ల మెదడు కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.
ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకుంటే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. వీటి వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభించి షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అయితే రాత్రి పూట నిద్రించడానికి కనీసం 30 నిమిషాల ముందు బాదంపప్పును తిని అనంతరం పాలను తాగాల్సి ఉంటుంది. పాలు అంటే అలర్జీ ఉన్నవారు సోయా పాలను తాగవచ్చు. గేద పాల కన్నా ఆవు పాలను ఇలా తాగుతుంటే ఇంకా ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా బాదంపప్పు, పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.