Ajwain Seeds | మనం రోజూ వంట చేసేందుకు అనేక రకాల దినుసులను ఉపయోగిస్తుంటాం. అనేక రకాల మసాలా దినుసులు మన ఆహారాల్లో రోజూ భాగం అవుతున్నాయి. వాటిల్లో వాము కూడా ఒకటి. ఇది ఘాటు వాసన, రుచిని కలిగి ఉంటుంది. దీన్ని వంటల్లో వేస్తుంటాం. ముఖ్యంగా పిండి వంటల్లో వామును ఎక్కువగా వాడుతుంటారు. అయితే భోజనం చేసిన అనంతరం రోజూ రెండు సార్లు చిటికెడు వామును తీసుకుని నమిలి మింగుతుండాలి. వామును తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. వాము పలు అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. భోజనం చేసిన అనంతరం వామును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చుని వైద్య నిపుణులు అంటున్నారు. వామును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన అనంతరం వామును తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా రాత్రి పూట నిద్రించేటప్పుడు కూడా శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. దీంతో అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. రోజూ వామును తింటే బరువు సులభంగా తగ్గుతారు. అదేవిధంగా వామును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌ల ఉత్పత్తికి వాము ఎంతగానో సహాయ పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను వాము తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వామును తింటే సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. పొట్టలో గ్యాస్ ఏర్పడడాన్ని వాము నివారిస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి వాము ఎంతో మేలు చేస్తుంది. అలాగే కడుపులో మంట నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఆమ్లాలు అతిగా ఉత్పత్తి కాకుండా చూస్తుంది. దీంతో అసిడిటీ నుంచి బయట పడవచ్చు. అలాగే అసిడిటీ కారణంగా వచ్చే గుండెల్లో మంట సమస్య కూడా తగ్గుతుంది. వామును తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అతిగా ఆహారం సేవించకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. కనుక తరచూ వామును తింటుండాలి.
కడుపు నొప్పి నుంచి కూడా వాము తక్షణ ఉపశమనం అందిస్తుంది. పొట్టలో ఏ కారణం చేత అయినా నొప్పి వస్తే వెంటనే వామును తినాలి. దీంతో తక్షణమే ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా చాలా మందికి అజీర్తి లేదా మలబద్దకం వల్ల పొట్టలో నొప్పిగా అనిపిస్తుంది. అలాంటి వారు వామును తింటే అన్ని సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టవచ్చు. వామును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. వాములో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములను నాశనం చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇలా వామును తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.