Watermelon Seeds | పుచ్చకాయలను తిన్న వెంటనే ఎవరైనా ఏం చేస్తారు..? ఆ కాయల్లో ఉండే విత్తనాలను పడేస్తారు. అయితే పుచ్చకాయల్లో ఉండే విత్తనాలు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుచ్చకాయ విత్తనాల్లో పప్పు ఉంటుంది. ఈ పప్పును తింటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పుచ్చ గింజల పప్పులో మన శరీరానికి కావల్సిన అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పప్పును తినడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. పుచ్చ గింజల పప్పును ఒక గుప్పెడు మోతాదులో తింటే సుమారుగా 150 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు 14 గ్రాములు, పిండి పదార్థాలు 5 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు, బి విటమిన్లు నియాసిన్, ఫోలేట్, థయామిన్, బి6, విటమిన్ ఇ, మెగ్నిషియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, కాపర్, పొటాషియం అధికంగా లభిస్తాయి.
పుచ్చ గింజల పప్పులో అనేక ప్రోటీన్లు ఉంటాయి. ఇవన్నీ వృక్ష సంబంధ ప్రోటీన్లు. కనుక నాన్ వెజ్ తినని వారు ప్రోటీన్లను ఈ పప్పు ద్వారా పొందవచ్చు. ఇవి కండరాల మరమ్మత్తులకు, నిర్మాణానికి సహాయం చేస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పొందేలా చేస్తాయి. కణజాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. పుచ్చ గింజల పప్పులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. రోజూ పుచ్చ గింజల పప్పును తింటే హృదయ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పప్పు ఎంతగానో మేలు చేస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
పుచ్చ గింజల పప్పులో జింక్, ఐరన్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ కణాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలను తగ్గేలా చేస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా నయం అవుతాయి. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. పుచ్చ గింజల పప్పులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పప్పును తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి జంకు లేకుండా పుచ్చ గింజల పప్పును రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు. దీంతో షుగర్ నియంత్రణలో ఉంటుంది.
పుచ్చ గింజల పప్పులో మెగ్నిషియం, ఫాస్ఫరస్, కాపర్ అధికంగా ఉంటాయి కనుక ఈ పప్పును తింటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు నిర్మాణమవుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ పప్పును తింటే అందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పుచ్చ గింజల పప్పును రాత్రి పూట గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. ఇలా పుచ్చ గింజల పప్పు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. కాబట్టి వీటిని రోజూ తినాలి.