ఒకప్పుడు డయాబెటిక్ బాధితులు దూరం పెట్టిన చిలగడదుంపలు ఇప్పుడు తిరిగి వారి ఆహార ప్రణాళికలో చేరుతున్నాయి. వీటిలోని ైగ్లెసెమిక్ ఇండెక్స్ (జీఐ), పీచు పదార్థం విలువలను వివరిస్తూ వాటిని వండే పద్ధతుల గురించి నిపుణులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. కేవలం పేరులో తీపి ఉండటం వల్లే మధుమేహ బాధితులు వీటిని చాలాకాలంగా పకన పెట్టారు. కానీ, చిలగడదుంపలోని పిండి పదార్థం రక్తంలో కలిసే విధానం.. మనం అనుకున్నదానికంటే చాలా సురక్షితంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
జీఐ ఆధారంగా: 0 నుంచి 100 వరకు ఉండే ైగ్లెసెమిక్ ఇండెక్స్ సేల్పై చిలగడదుంపల స్థానం తకువగా ఉంది. పొట్టుతో సహా వండిన చిలగడదుంపల జీఐ విలువ 44 నుంచి 61 మధ్యలో ఉండటం వల్ల మధుమేహ బాధితులు వీటిని హాయిగా తినొచ్చు.
పద్ధతిగా వండాలి: చిలగడదుంపను మీరు ఎలా వండుతున్నారనే దానిపైనే అది మీ చకెర స్థాయులను ఎంత పెంచుతుందనేది ఆధారపడి ఉంటుంది. వేయించడం, ఉడకబెట్టడం, గుజ్జు చేయడం వల్ల దాని గుణం మారుతుంది. వండే శైలిని బట్టే రక్తంలోకి చేరే గ్లూకోజ్ వేగం మారుతుంది.
ఆప్తుడిలా: ప్రతి చిలగడదుంపలో దాదాపు 4 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఒక భద్రతా వలయంలా పనిచేస్తూ రక్తంలో చకెర స్థాయులు అమాంతం పెరగకుండా కాపాడుతుంది. ఇన్సులిన్ నిర్వహణలో ఆప్తుడిలా పనిచేస్తుంది.
మేలు చేసే రంగు: ఇందులోని నారింజ రంగు బీటా-కెరోటిన్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు చిలగడదుంపలో పుషలంగా ఉన్నాయని సూచిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఎ మధుమేహ బాధితులలో వచ్చే కంటి సమస్యలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది.
వాటికంటే మేలైనవి: సాధారణ ఆలుగడ్డల జీఐ విలువ 85 లేదా అంతకంటే ఎకువే. ఇవి రక్తంలో చకెర స్థాయులను వేగంగా పెంచుతాయి. చిలగడదుంపలు ఇందుకు పూర్తిగా భిన్నం. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకే పిండి పదార్థాలు ఉన్న ఆహారాలలో ఇవి మేలైనవిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అతిగా తినొద్దు: ఎంత రుచికరమైన ఆహారమైనా అతిగా తింటే నష్టమే! చిలగడదుంప కూడా ఈ కోవకు చెందిందే. సుమారు 150 గ్రాముల చిలగడదుంపను సమతుల్య ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎకువ తీసుకుంటే చకెర స్థాయులు పెరుగుతాయి. నేరుగా కాకుండా పప్పులు, మాంసం, ఇతర తకువ జీఐ ఉన్న కూరగాయలతో చిలగడదుంపను కలిపి తీసుకోవడం మేలు.