Onion Peel Benefits | ఉల్లి తొక్కలతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు.. తెలిస్తే విడిచిపెట్టరు..
Onion Peel Benefits | ఉల్లిపాయ తొక్కలే అని తీసిపారేయకండి. వీటి ద్వారా ఉల్లిపాయ మాదిరిగానే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎన్నో రకాలు మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవచ్చు. ఈసారి ఉల్లిపాయ తొక్కలను తీసి చెత్తలో పారేయకుండా వాడి చూడండి. నిజాలు తెలుస్తాయి.
Onion Peel Benefits | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నది పాత సామెత.. ఉల్లి తొక్కలు చేసే మేలు ఎవరూ చేయలేరు అన్నది కొత్త సామెత. అంతగా ఉల్లి తొక్కలతో ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతాయి. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి.
మనలో చాలా మంది ఉల్లి తొక్కలను తీసిపారేస్తుంటాం. ఈ తొక్కలతో మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని తెలియక వాటిని చెత్తకుండీ పాలు చేస్తుంటాం. నిజానికి ఉల్లిపాయ తొక్కలు మంచి పోషకాలు. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి.
ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు..
ఉల్లిపాయ పీల్ టీ
ఉల్లిపాయ తొక్కలను నీటిలో 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టి తొక్కలను వడ కట్టి ఆరోగ్యకరమైన కప్పు టీని తయారుచేసుకుని త్రాగవచ్చు. ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చర్మం దురదకు ఉపశమనం
ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు.
హెయిర్ డై
సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలింత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలపాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు.
మంచి కంపోస్ట్
కంపోస్ట్ తయారు చేయడానికి ఉల్లిపాయ తొక్కలు గొప్పగా సాయపడతాయి. సులభమైనవి. వీటిలో ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉండి మంచి కంపోస్ట్ తయారవుతుంది.
సువాసన ఏజెంట్
ఉల్లిపాయ తొక్కలు గొప్ప సువాసన ఏజెంట్లు. ఉల్లిపాయ తొక్కలను వేయించడం ద్వారా వంటల రుచి, రంగును మెరుగుపరచుకోవచ్చు.
సూప్స్ అండ్ గ్రేవీ
స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు.
మంచి నిద్రకు
ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
హెయిర్ టోనర్
పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి.
చివరగా..
ఈసారి ఉల్లిపాయ తొక్కలను చెత్త కుండీలో విసిరేయకుండా వాటిని సద్వినియోగం చేసుకునేలా చూసుకోండి. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ఫ్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించే ముందు తొక్కల్లో రసాయన అవశేషాలు, పురుగుమందులు లేకుండా శుభ్రంగా కడుక్కోవడం మరిచిపోవద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

