Migraine | మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఇదిగో సూచనలు
Migraine | జన్యుపరమైన సమస్యల వల్ల, కొన్ని పర్యావరణ కారకాల వల్ల వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. డాక్టర్లు సూచించే మందులతోపాటు కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే...
సాధారణంగా మనకు వచ్చే తలనొప్పులు త్వరగానే తగ్గుతాయి. ప్రస్తుత ఆధునిక కాలంలో మారిన జీవనశైలి.. ఒత్తిడి కారణంగా తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. కొన్నిసార్లు త్వరగా తగ్గినా.. మరికొన్ని సార్లు మరింత తీవ్రమవుతుంది. సాధారణ తలనొప్పి గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. అయితే, మైగ్రేన్ తలనొప్పి అంత త్వరగా తగ్గదు. తీవ్రమైన నొప్పి, బాధ ఉంటాయి. నొప్పి పొడిచినట్లు వస్తుంటుంది. అయితే మైగ్రేన్ సమస్య వస్తుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. జన్యుపరమైన సమస్యల వల్ల, కొన్ని పర్యావరణ కారకాల వల్ల వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. డాక్టర్లు సూచించే మందులతోపాటు కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ సూచనలు ఏమిటంటే…
నిత్యం మన శరీరానికి సరిపోయే నీటిని తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. డీ హైడ్రేషన్ బారిన పడి తలనొప్పిని తెచ్చుకుంటాం. అయితే నీటిని తగినంత మోతాదులో తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.
రోజూ ఒకే సమయానికి నిద్రలేవాలి. కొందరు ఒక రోజు ఉదయాన్నే లేస్తే.. మరొక రోజు ఆలస్యంగా నిద్ర లేస్తారు. అలా చేయకూడదు. రోజూ ఒకే టైముకు నిద్ర లేవడం వల్ల ఒత్తిడి కలగకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది.
కొందరు ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కచ్చితంగా చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ మానేయకూడదు. బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే ఒత్తిడి ఎక్కువై తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కంప్యూటర్ల ఎదుట పనిచేసే వారికి సహజంగానే తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు మధ్య మధ్యలో కొద్దిగా బ్రేక్ తీసుకోవాలి. లేదా కంప్యూటర్‌కు కొంత దూరంలో ఉండి పనిచేయాలి. దీంతో కళ్లపై కలిగే ఒత్తిడి తగ్గి తలనొప్పి రాకుండా ఉంటుంది.
నిత్యం అధిక మోతాదులో కాఫీ తాగినా లేదా మద్యం సేవించినా మైగ్రేన్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. కనుక వాటికి దూరంగా ఉంటే మంచిది.
మద్యం తీసుకున్నవారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 35 శాతం అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకని మద్యం తీసుకోవడాన్ని పూర్తిగా మానేడం మంచిది.
కృత్రిమ చక్కెరలతో తయారైన ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా మైగ్రేన్‌కు కారణమవుతుంటాయంట. వీటని పూర్తిగా తగ్గించినా వచ్చే నష్టమేమీ ఉండదని వారంటున్నారు.
మోనోసోడియం గ్లూటమేట్ ఉన్న ఆహారాలను దూరంగా పెట్టడం వల్ల కొంతవరకు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
వివిధ ఆహారాల రంగు, రుచిని కాపాడే నైట్రేట్లు రక్తంలోకి నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేసి రక్తనాళాల్లో విస్తరించి మైగ్రేన్‌కు అవకాశం కల్పిస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. అందుని ఇలాంటి ఆహారాలను దూరం పెట్టాలి.
చాక్లెట్లు అధికంగా తినేవారిలో 22 శాతం అధికంగా మైగ్రేన్ వస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందుకని అన్ని రకాల చాక్లెట్లను దూరం పెట్టాలి.
పులియబెట్టిన చీజ్ లేదా ఏజ్డ్ చీజ్, సోయా సాస్‌లతో ఉండే టైరమైన్ అనే పదార్థం మైగ్రేన్‌కు ట్రిగ్గర్‌గా ఉంటున్నందున వీటిని తినకుండా చూసుకోవాలి.
మైగ్రేన్ లక్షణాలివీ..
- కళ్లముందు జిగ్ జాగ్ లైన్లు కనిపిస్తాయి.
- కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎర్రబడుతాయి.
- చెవులలో శబ్ధాలు వినిపిస్తాయి.
- మైకం కమ్మినట్లుగా అనిపిస్తుంది.
- వెలుతురును చూడలేకపోతారు.
- చిన్న కాంతిని చూడగానే వాంతి చేసుకుంటారు.
- కొద్దిపాటి శబ్ధాలను కూడా భరించలేరు.
- ఎప్పుడూ చికాకుగా ఉంటారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

