Liver Damage | ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాలేయం సమస్యలకు కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు పలు సమస్యలు సైతం కారణమే. కాలేయ సమస్యలతో బతకడం చాలాకష్టం. ఆరోగ్యంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు దాన్ని సహజంగానే డీటాక్స్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమే. అయితే, సాధారణంగా ఆల్కహాల్ మాత్రమే కాలేయం దెబ్బతినడానికి కారణంగా భావిస్తారు.
కానీ, వాస్తవానికి బయట వేయించిన జంక్ ఫుడ్లను ఎక్కువగా తీసుకుంటే.. మీ కాలేయంలో వ్యర్థాలు సైతం పేరుకుపోతాయి. కాలేయం కొంతవరకు తనను తాను శుభ్రపరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మం దురద, ముదురు మూత్రం, ఎప్పుడూ అలసిపోయినట్లుగా అనిపించడం, వికారం, వాంతులు, కడుపులో నొప్పి.. వాపు, చర్మం పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలు కనిపిస్తే మీరు కాలేయ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. వాటిని విస్మరించడం వల్ల మీరు ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉన్నది.
WEBMD ప్రకారం.. పుదీనా టీ కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా ఆకుల్లో మెంథాల్, మెంథోన్ వంటి ముఖ్యమైన నూనెలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. పుదీనా టీ తయారు చేయడానికి.. ఒక గిన్నెలో నీటిని మరిగించి, కొన్ని పుదీనా ఆకులు కలిపి కలపాలి. దాన్ని కొంతసేపు అలాగే ఉంచి.. రాత్రి పడుకునే అరగంట ముందు తాగాలి.
పసుపు అనేది ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగించే శక్తివంతమైన మసాలా. అలాంటి పరిస్థితిలో ప్రతిరోజూ పసుపు టీ తీసుకోవడంతో శరీరం, కాలేయాన్ని శుభ్రం చేసేందుకు చాలా సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి.. ఒక గ్లాసు వేడినీటిలో చిటికెడు పసుపు వేసి తేనె కలిపి తీసుకోవాలి.
అల్లం, నిమ్మకాయ మిశ్రమం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. శరీరాన్ని డీటాక్సిక్ చేయడంతో పాటు బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ మిశ్రమం వాపు నుంచి ఉపశమనం కలిగించడానికి.. జీవక్రియను పెంచడానికి, వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. దాంతో తయారు చేయడానికి.. ఒక గ్లాస్ వేడినీటిలో సగం నిమ్మకాయ రసం, అల్లం ముక్కను జోడించి కలపాలి. అలాగే, 15 నిమిషాల్లో అలాగే ఉంచి.. వడగట్టి తాగాలి.
మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఈ సులభంగా తయారు చేయగల డీటాక్స్ పానీయాన్ని తయారు చేయడానికి, ఒక గ్లాసు వేడినీటిలో ఒక టీస్పూన్ మెంతి పొడిని కలపాలి. దాన్ని 15 నిమిషాలు అలాగే ఉంచాలి. నీటిని ఒక కప్పులో వడకట్టి రోజుకు మూడుసార్లు తాగాలి.
చమోమిలే టీ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడే లక్షణాలు ఉంటాయి. ఇది నాడీ వ్యవస్థను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది వాపు కణజాలాలను శాంతపరుస్తుంది. ఈ టీని తయారు చేసుకునేందుకు ఒక గ్లాసు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ చమోమిలే పువ్వులను కలపాలి. ఒక 10 నిమిషాలు మూతపెట్టి, ఆపై తాగాలి.