Headache Remedy | తలనొప్పి సాధారణంగా తలలోగానీ, మెడలోగానీ నొప్పి కలిగించే జబ్బు లక్షణం. తలలో ఒకవైపునకు గానీ, రెండువైపులాగానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. నొప్పి ఒక బిందువు నుంచి మరో బిందువు మారవచ్చు. విస్తరించవచ్చు. హెచ్చుతగ్గులు కావచ్చు. కొన్ని నిమిషాల నుంచి కొన్ని రోజుల పాటు కూడా బాధించవచ్చు. అయితే, ఎక్కువ కాలం పాటు తలనొప్పి వస్తే మాత్రం దానిని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చిందంటే ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి తగ్గకపోతే అవస్థ మరింత ఎక్కువవుతుంది. అయితే ఎలాంటి తలనొప్పినైనా మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు మీ కోసం..