Chaat Masala : ఆహార పదార్ధాలను సిద్ధం చేసే క్రమంలో కిచెన్‌లో తరచుగా నిత్యం వాడే పదార్ధం ఖాళీ కావడం చూస్తుంటాం. సాల్ట్, షుగర్ ఇలా వంటలకు రుచి ఇచ్చే కీలక పదార్ధం అనూహ్యంగా నిండుకోవడం జరుగుతుంటుంది. ఇలా జరిగినప్పుడు ప్రత్యామ్నాయాలను ప్రయత్నించడం లేదా సాయం కోసం అమ్మలను ఆశ్రయిస్తుంటారు.
ఇక వంటింట్లో ఇలాంటి కీలక పదార్ధం చాట్ మసాలాను చాలా మంది మిస్ అవుతుంటారు. ఆ సమయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. చాట్ మసాలాకు దీటైన ప్రత్యామ్నాయాలతో వంట ఫ్లేవర్, టేస్ట్ మిస్ కాకుండా వీటిని వాడుకోవచ్చు.
ఇక చాట్ మసాలాకు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే..ముందుగా ఆమ్చూర్ పౌడర్‌గా పేరొందిన డ్రై మ్యాంగో పౌడర్ ఛాట్ మసాలాకు మెరుగైన ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఒక టీ స్పూన్ చాట్ మసాలా బదులు ఓ టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్‌ను వాడితే దాదాపు అదే ఫ్లేవర్, టేస్ట్‌ను అందిస్తుంది. ఇక బ్లాక్ సాల్ట్, కర్రీ పౌడర్, చింతపండు చట్నీ, గరం మసాలా వంటి ప్రత్యామ్నాయాలను చాట్ మసాలా ప్లేస్‌లో వాడుకోవచ్చు.
డ్రై మ్యాంగో పౌడర్
బ్లాక్ సాల్ట్
కర్రీ పౌడర్
చింతపండు చట్నీ
గరం మసాలా
Read More :
Drugs | గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!