Spices For Immunity | సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మందికి దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తుంటాయి. గొంతు, ఊపిరితిత్తులు, శ్వాస నాళాల్లో కఫం చేరుతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్యల తీవ్రత తక్కువగానే ఉంటుంది కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మాత్రం ఈ సమస్యలు మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే ఫ్లూ, ఆస్తమా, బ్రాంకైటిస్, జ్వరం వంటి సమస్యలు కూడా వస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఒక పట్టాన తగ్గవు. కానీ మన ఇంట్లో ఉండే పలు మసాలా దినుసులను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తిని ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండేలా చేసుకోవచ్చు. దీంతో అనేక రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
మన వంట ఇంటి పదార్థాల్లో ఇంగువ కూడా ఒకటి. దీన్ని కొందరు తరచూ వంటల్లో వేస్తుంటారు. ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. రోజూ వంటల్లో ఇంగువను వేసి వాడితే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఎల్లవేళలా ఎక్కువగా ఉంటుంది. రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే పసుపును కూడా మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగాలి. లేదా పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. పసుపు వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో మిరియాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. రోజూ రాత్రి గోరు వెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగుతుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే వంట ఇంటి మసాలా దినుసుల్లో ఒకటైన లవంగాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. రోజూ రాత్రి పూట ఒకటి లేదా రెండు లవంగాలను తిని గోరు వెచ్చని పాలు లేదా నీళ్లను తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మెంతులను కూడా మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తాం. ఇవి కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని తినాలి. ఇలా చేస్తుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెంతులను నేరుగా తినలేకపోతే మెంతుల పొడిని మజ్జిగలో లేదా గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
ఇక వంట ఇంటి మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చిన చెక్క కూడా మనకు మేలు చేస్తుంది. ఇందులో మాంగనీస్, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని రోజూ తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. దాల్చిన చెక్క పొడిని మీరు తినే ఆహారాలపై చల్లి తీసుకోవచ్చు. లేదా గోరు వెచ్చని పాలు, నీటిలో కలిపి కూడా తాగవచ్చు. దీంతో ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా మసాలా దినుసులు, వంట ఇంటి పదార్థాలు మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. కనుక వీటిని తరచూ తీసుకోవాలి.