Parenting Tips | కెరీర్లో ఎంత బిజీ ఉన్నా సరే పిల్లలకు టైమ్ ఇవ్వాల్సిందే.. లేదంటే ఈ ముప్పు తప్పదు!!
Parenting Tips | చిన్నారుల భవిష్యత్ తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంది. వారి కోసం ఆస్తులు, డబ్బులు కూడబెట్టడమే.. ప్రేమ అనుకుంటే పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. వారి కోసం సమయం కేటాయించి వారికి భరోసానిచ్చేలా జ్ఞానాన్ని పంచాలంటున్నారు. సృజనాత్మక ఆలోచనలే జీవితంలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతాయి.
Parenting Tips | సిటీబ్యూరో, ఏప్రిల్ 8 ( నమస్తే తెలంగాణ) : అతడి పేరు రాజు. భార్య కూడా ఐటీ ఉద్యోగి కావడంతో ఇద్దరు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లిపోయేవారు. పిల్లలను చూసుకోవడానికి కేర్ టేకర్‌ను నియమించుకున్నారు. అయితే చిన్న పాప సిరి(5)కి మాటలు రావట్లేదని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, పరీక్షించి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే మీరు మాటలు చెబితే పిల్లలు విని వాటిని పలుకుతారని పేరెంట్స్‌కు సూచించారు. కచ్చితంగా పిల్లలకు సమయం కేటాయించాలన్నారు. మీరు పట్టించుకోకుంటే పాప ఆటిజం బారినపడే అవకాశమూ ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఆ దంపతుల్లో ఒక్కరు ఉద్యోగం మానేసి పాపను చూసుకుంటున్నారు.
చిన్నారుల భవిష్యత్ తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంది. వారి కోసం ఆస్తులు, డబ్బులు కూడబెట్టడమే.. ప్రేమ అనుకుంటే పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. వారి కోసం సమయం కేటాయించి వారికి భరోసానిచ్చేలా జ్ఞానాన్ని పంచాలంటున్నారు. సృజనాత్మక ఆలోచనలే జీవితంలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతాయి. అటువంటి లక్షణాలను పిల్లల్లో చిన్ననాటి నుంచే అభివృద్ధి చేయాలంటే తల్లిదండ్రులు పిల్లలతో తగిన సమయం కేటాయించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు ఒకే ప్రశ్నను పలుమార్లు అడుగుతుంటారు. పుస్తకాల్లో ఇష్టమొచ్చినట్టు బొమ్మలు గీస్తుంటారు. అయితే పేరెంట్స్ ఇదేంటని కోప్పడటం కాకుండా అందులో ఉన్న ప్రాధాన్యతను వివరించాలి. వారిలో సృజన పెంపొందాలంటే వారికి ప్రతీ విషయం అర్థమయ్యే వరకు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే వారు సరికొత్తగా ఆలోచించగలుగుతారని నిపుణులంటున్నారు.
మానసిక ఎదుగుదలపై దృష్టి సారించాలి
3-10 ఏండ్ల పిల్లల్లో శాస్త్రీయ జిజ్ఞాస, పరిశీలించే తత్వం ఉంటాయి. బాల్యంలో నేర్చుకునే సామర్థ్యం, ఆసక్తి ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయం తెలుసుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఒక్కటికి పదిసార్లు ప్రశ్నిస్తుంటారు. అయితే వారు అడిగిన ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇస్తూ అర్థమయ్యేలా వివరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. పట్టించుకోకపోతే వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన తగ్గిపోతుంది. పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగితే వాటికి ఓపికగా సమాధానమివ్వాలి.
– లక్ష్మి, సైకాలజిస్టు
పజిల్స్ ఆడించాలి
భార్యాభర్తలు ఉద్యోగం చేసే వారి ఇంట్లోని పిల్లల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు ముగించుకుని నీరసంగా ఇంటికి వస్తున్నారు. దీంతో పిల్లలతో గడపాలనే ఆసక్తి వారికి ఉండటం లేదు. ఇది సరైనది కాదు. వారితో కలిసి ఆడుకోవడం, మాట్లాడటం చేయాలి. ఏదైన ఆందోళనలో ఉన్నారా? అని పరిశీలించాలి ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుపాలి. మెదడుకు పదునుపెట్టే సుడోకు, పజిల్స్ లాంటి ఆటలను ఆడించాలి.
– డాక్టర్ మోతుకూరి రాంచందర్, సైకాలజిస్టు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

