Healthy Foods | చేపలు తినని వారికి గుడ్న్యూస్.. ఒమేగా 3 అందించే ఆహారాలు ఇవే!
Healthy Foods | గుండె పనితీరుని మెరుగ్గా ఉంచడం, నాడీ కణాలకు రక్షణ పొరను నిర్మించడం, రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్, క్యాల్షియం లాంటి వాటిని తీసేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం లేకుండా ఉండాలంటే చేపలు బాగా తినాలని చాలామంది సలహాలిస్తారు.
Healthy Foods | గుండె పనితీరుని మెరుగ్గా ఉంచడం, నాడీ కణాలకు రక్షణ పొరను నిర్మించడం, రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్, క్యాల్షియం లాంటి వాటిని తీసేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం లేకుండా ఉండాలంటే చేపలు బాగా తినాలని చాలామంది సలహాలిస్తారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేది నిజమే. కానీ, వాటిల్లోనే ఉంటుందని, అధికంగా ఉంటుందనేవి భ్రమలే. వంద గ్రాముల చేపలో 2.5 నుంచి 3 గ్రాములే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
మార్కెట్లో తక్కువ ధరలో ఉండే మెంతి కూర, మునగాకు, అవిసె గింజల్లో అంతకంటే ఎక్కువ మోతాదులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వంద గ్రాముల అవిసె గింజల్లో 22 గ్రాములు, చియా గింజల్లో 17 గ్రాములు, వాల్నట్స్లో 9 గ్రాముల వరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి చురుకైన మెదడు, గుండె ఆరోగ్యం కోసం చేపలు తింటే మంచిది. తినకపోతే ప్రమాదం అనేది అవాస్తవం. ఏది తిన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం వారానికి రెండు రోజులు తీసుకుంటే మంచిది. చేపలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు అన్నది నిజమే. కానీ, చేపలు తినని వాళ్లకు నష్టమన్నదాంట్లో నిజం లేదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

