Summer Diet | మన పెద్దలు ప్రతి రుతువుకూ ఓ భోజన విధానాన్ని నిర్ణయించారు. పళ్లెంలో ఆయా పదార్థాలకు చోటు కల్పించడం ద్వారా ఎండ వేడిమిని తట్టుకోగలం. పొట్టను చల్లగా ఉంచుకోగలం.
వడగాడ్పులు ప్రమాదకరం. కొన్నిసార్లు పక్షవాతానికి కూడా కారణం అవుతాయి. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి బీట్రూట్ను ఆశ్రయించాలంటారు నిపుణులు. ఇందులో ఫైబర్, బీటా-కెరోటిన్ అధికం.
శరీరాన్ని చల్లగా ఉంచే స్వభావం దీని సొంతం. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఐరన్, పొటాషియం, విటమిన్-ఎ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు అపారం. ఊబకాయాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది.
ఇందులో లేని సుగుణాలంటూ ఉండవు. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్, నొప్పి నివారిణి.. మచ్చుకు కొన్ని. చల్లదనాన్నిచ్చే గుణమూ ఉంది.
దీనిలోని లైకోపిన్ అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. గుండె జబ్బులు, పక్షవాతం, జ్ఞాపకశక్తి లోపాలు నివారిస్తుంది.
శరీరాన్ని తేమగా ఉంచుతుంది. చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. వడదెబ్బను నివారిస్తుంది. శరీరానికి వేడి తగలకుండా అడ్డుకునే చల్లని నేస్తమిది.