సరైన జాగ్రత్తలతో..
స్త్రీలలో ప్రతి 28 రోజులకు ప్రకృతి సహజంగా జరిగే జీవక్రియ మెన్స్ట్రువేషన్ లేదా నెలసరి. దీనినే రుతుక్రమం అంటారు. ఈ ప్రభావం 5 రోజులు ఉంటుంది. కాబట్టి, నెలసరి సమస్యల పట్ల అవగాహన కోసం ఐదో మాసం అయిన మే నెలను, ఆ నెలలో 28వ తేదీని ఎంచుకున్నారు.
స్త్రీలలో ప్రతి 28 రోజులకు ప్రకృతి సహజంగా జరిగే జీవక్రియ మెన్స్ట్రువేషన్ లేదా నెలసరి. దీనినే రుతుక్రమం అంటారు. ఈ ప్రభావం 5 రోజులు ఉంటుంది. కాబట్టి, నెలసరి సమస్యల పట్ల అవగాహన కోసం ఐదో మాసం అయిన మే నెలను, ఆ నెలలో 28వ తేదీని ఎంచుకున్నారు. 2014 నుంచి ప్రతి ఏడాది మే 28వ తేదీని ‘రుతుక్రమ ఆరోగ్య దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. గర్భాశయం గోడల నుంచి రక్తం, కణజాలాన్ని బయటికి విసర్జించే ప్రక్రియే నెలసరి అంటే. ఆరోగ్యకరమైన నెలసరి స్త్రీలను ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. దుర్వాసనలు రాకుండా ఉంచుతుంది. నెలసరి సమయంలో సౌకర్యవంతంగా ఉండటానికి దోహదపడుతుంది. ఈ సమయంలో విడుదలయ్యే రక్తాన్ని పీల్చుకునేందుకు శానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్, మెన్స్ట్రువల్ కప్స్, మెన్స్ట్రువల్ డిస్కులు, పీరియడ్ అండర్వేర్ లాంటి రకరకాల మెన్స్ట్రువల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినా కొన్ని చిట్కాలను కూడా పాటించాలి.
వెజీనాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్‌కు వెళ్లిన ప్రతీసారి, మెన్స్ట్రువల్ ఉత్పత్తి వాడటానికి ముందు, ఆ తర్వాత.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వాడిన మెన్స్ట్రువల్ వస్తువులను సురక్షితంగా పారవేయాలి. శానిటరీ ప్యాడ్లను తరచూ మారుస్తూ ఉండాలి. ట్యాంపన్లను 4 నుంచి 8 గంటలకోసారి మార్చాల్సిందే. అదే మెన్స్ట్రువల్ కప్స్ అయితే వాడిన తర్వాత తప్పకుండా శుభ్రం చేయాలి. తేలికగా, గాలి ఆడేలా ఉండే కాటన్ లోదుస్తులు ధరించాలి. మెన్స్ట్రువల్ ఉత్పత్తులను రెగ్యులర్‌గా మారుస్తూ ఉండాలి. ఒకే ప్రొడక్ట్‌ను ఎక్కువకాలం వాడితే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సరిపోయినన్ని నీళ్లు తాగాలి. దీనివల్ల మూత్రనాళం ఎప్పటికప్పుడు శుభ్రపడుతూ ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. ఇక మహిళల ఆరోగ్యానికి నెలసరి కూడా ఒక సూచిక. నెలసరి క్రమం తప్పిందంటే.. డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వ్యాధులకు సంకేతంగా భావించాలి. దీనికోసం క్యాలెండర్‌ను గానీ, లేదంటే స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ద్వారా గానీ నెలసరి క్రమాన్ని గమనించుకుంటూ ఉండాలి. నెలసరి సమయంలో దుర్వాసన వస్తున్నా, తీవ్రంగా, అసాధారణంగా నొప్పి ఉన్నా, రక్తం ఎక్కువగా, ఎక్కువ కాలంపాటు బయటికి వెళ్తున్నా డాక్టర్‌తో మాట్లాడాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

