వేధించే నోటిపూతకు సులువైన పరిష్కారం

హైదరాబాద్: ఒంట్లో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత కారణంగా భయంకరమైన నొప్పి ఉంటుంది. ఈ నోటిపూత అనేది ఒక్కోసారి నోట్లో ఏదో ఒక్కచోట మాత్రమే ఉంటుంది. అదే భరించలేని అనుకుంటే ఒక్కోసారి నోరంతా అల్సర్లు వస్తాయి. ఇక ఆ నరకయాతన వర్ణనాతీతం. అయితే ఇంతలా వేధించే ఆ నోటిపూత సమస్య నుంచి చిన్నచిన్న చిట్కాలతో బయటపడవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..?
- నోటి పూత సమస్య వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లను బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. కాబట్టి కొబ్బరీనీళ్లు తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
- అదేవిధంగా నోటిపూత ఉన్నప్పుడు ఎండు కొబ్బరిని నమలడంవల్ల కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఇలా ఎండు కొబ్బరి నమలడంవల్ల అల్సర్ పుండ్లలోని సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో నోటిలో అల్సర్స్ త్వరగా తగ్గిపోతాయి. అల్సర్ ఉన్న ప్రాంతంలో కొబ్బరి నూనె రాయడంవల్ల కూడా ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
- నోట్లో అల్సర్స్ ఉన్నన్ని రోజులు తరచుగా చల్ల తాగడంవల్ల కూడా పరిష్కారం లభిస్తుంది. చల్లకు కూడా శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉన్నది.
- ఇక గసగసాలు కూడా నోటిపూతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. గసగసాలు కలిపిన నీటిని ఎక్కువగా తాగుతూ ఉండటంవల్ల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు.
- అదేవిధంగా తులసి ఆకులను నములుతూ దానిద్వారా వచ్చే రసాన్ని మింగడం ద్వారా కూడా నోటిపూతకు పరిష్కారం లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

