Bone disease | ఎముక వ్యాధి నివారణకు చిట్కాలు
Bone disease | ఎముకలు ఆరోగ్యంగా ఉంటే మనమూ ఆరోగ్యంగా ఉంటాం. అందుకని శరీరంలోని అన్ని ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఎముకల సాంద్రత పెంచుకునేందుకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Bone disease | ఎముకలు మన శరీరానికి ఆకృతనిస్తాయి. ఎముకలే లేకపోతే శరీరం ముద్దలా మారి కుప్పకూలుతుంది. తేలిగ్గా కదలాలన్నా, చురుకుగా ఉండాలననా ఎముకల పాత్ర ముఖ్యమైనది. ఊరికే ఎముకలు ఉంటే సరపోదు.. అవి బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే మన శక్తివంతంగా ఉంటాం. ఏ ఒక్క ఎముక బలహీనంగా మారినా, అనారోగ్యానికి గురైనా మొత్తం శరీరం స్తంభించిపోతుంది. అందుకని శరీరంలోని అన్ని ఎముకల ఆరోగ్యంపై మనం దృష్టిపెట్టాలి.
రీరంలో కాల్షియం లేకపోవడం. ఆహారంలో తగినంత క్యాల్షియం లేకపోయినా, శరీరం క్యాల్షియంను గ్రహించలేకపోయినా ఎముకలు బలహీనమవుతాయి. కాల్షియమ్ తగ్గితే ఎముకలు పెళుసుగా మారి చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోతుంటాయి. ఎముక మజ్జ నుంచే తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు పుడతాయి. మనం 30 ఏండ్ల వయసు వచ్చే సమయానికి ఎముకలు గరిష్ట ద్రవ్యరాశిని అందుకుంటాయి. ఆ తర్వాత మనం పొందే దానికంటే ఎక్కువ ద్రవ్యరాశిని కోల్పోతుంటుంది. ఇక అప్పటి నుంచి ఎముకల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. బలహీనంగా ఉండే ఎముకలు కీళ్లు, వెన్ను నొప్పులు, బెణుకులు, పగుళ్లకు దారితీసే అవకాశాలు ఉంటాయి.
కాల్షియం అధికంగా ఉండే ఆహారం
మన శరీరం కాల్షియంను తయారుచేసుకోలేదు. దీన్ని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు కాల్షియం ముఖ్యమైనది. ఎముకలు నిర్మాణం నిరంతర ప్రక్రియలో ఉంటాయి. కాబట్టి ఎముకల బలం, నిర్మాణం కోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. 19-50 ఏండ్ల వయసు వారు నిత్యం ఆహారం ద్వారా 1000 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాలి. ఇక 51-70 ఏండ్ల వయసు వారు 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, బ్రోకలి, సోయా ఉత్పత్తులను ఎక్కువగా తినాలి.
డీ విటమిన్ చాలా ముఖ్యం
కాల్షియం ఎంత ముఖ్యమో డీ విటమిన్ కూడా అంతే ముఖ్యమైనది. సరైన మొత్తంలో కాల్షియం ఉన్నప్పటికీ, డీ విటమిన్ సాయం లేకుండా దానికి శరీరం దానిని గ్రహించదు. తగినంత డీ విటమిన్ పొందని వ్యక్తులు ముఖ్యంగా పిల్లలు తక్కువ ఎముక సాంద్రత కలిగి ఉంటారు. ఫలితంగా ఎముక క్షీణతకు గురవుతుంది. డీ విటమిన్ పొందాలంటే ఎండలో ఉండటం ఒక్కటే సరైన మార్గం. ఆయిలీ ఫిష్, పుట్టగొడుగులు, గుడ్లు, పాలు, తృణధాన్యాలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
బరువు మోసే వ్యాయామాలు..
బరువు మోసే వ్యాయామాలు కొత్త ఎముకల ఏర్పాటును ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. ఈ వ్యాయామాల్లో వాకింగ్, జాగింగ్ ప్రధానమైనవి. మెట్లు ఎక్కడం ద్వారా కూడా ఎముకలకు వ్యాయామం అవుతుంది. ఇలాంటి బరువు మోసే వ్యాయామాల వల్ల ఎముకలు దృఢంగా ఉండి త్వరగా పెలుసుబారకుండా ఉంటాయి.
ఆహారంలో ప్రోటీన్ చేర్చాలి
ఎముకలు దాదాపు 50 శాతం ప్రోటీన్‌తో తయారై ఉంటాయి. అందుకని ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ చేర్చుకోవడం చాలా ముఖ్యం. తక్కువ ప్రోటీన్ తీసుకోవడం శరీరం తక్కువగా కాల్షియంను పొంది తద్వరాఆ ఎముకల నిర్మాణం, విరిగిపోయే ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉండొచ్చు. అందుకని ప్రొటీన్‌లో చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా లేని సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ప్రోటీన్తోపాలు మెగ్నిషియం, కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వులు, రాగులు, ఒమేగా-3 కొవ్వులుండే ఆహారాలను తీసుకోవాలి.
ఎముకలు బలంగా ఉండలంటే..
- నిద్రలేమి సమస్య లేకుండా చూసుకోవాలి.
- ఉప్పు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
- సిగరెట్ స్మోకింగ్ మానేయాలి.
- కాఫీని పూర్తిగా మానుకోవాలి.
- ఆల్కహాల్ వీలైనంత తక్కువగా తీసుకోవడం బెటర్
- విటమిన్ సీ, విటమిన్ కే, పొటాషియం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను నిత్యం తినాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

